తీవ్ర హెచ్చరికలు పంపిన ప్రధాని మోదీ

0
684

భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ కమల వికాసం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.. తెలంగాణ ప్రభుత్వం మొత్తాన్ని మునుగోడుకు తీసుకొచ్చారని ఆరోపించారు. తెలంగాణలో కుటుంబ పాలన పోయి బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు మోదీ. అవినీతి, కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికి మొదటి శత్రువులని అన్నారు. హైదరాబాద్ ఐటీ రంగానికి కంచుకోట అని…ఐటీ కారిడార్‌లో టీఆర్ఎస్ మూఢనమ్మకాలను పెంచి పోషిస్తోందని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని దుష్టశక్తులు ఏకమయ్యాయని మోదీ విమర్శించారు. ప్రజలు తమ కోసం పనిచేసే బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని మోడీ అభిలషించారు. కొందరు భయంతో నిరాశతో తనను బూతులు తిడుతున్నారని ఆరోపించారు.

తెలంగాణలో ఏ ఉప ఎన్నిక జరిగినా బీజేపీ ఆదరిస్తున్నారని దీనికి కారణమైన కష్టపడే బీజేపీ కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్పటానికి వచ్చానని అన్నారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు పోరాట పటిమ కలవారని వారినుంచి నేను స్ఫూర్తి పొందుతున్నానన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టే ఇబ్బందులను తట్టుకుని బీజేపీ కార్యకర్తలు అడుగులు ముందుకు వేస్తున్నారని.. అటువంటి కార్యకర్తలు బీజేపీకి మాత్రమే ఉంటారన్నారు. అవినీతిపరులంతా ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని.. దోచుకున్న వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు ప్రధాని మోదీ.