ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన మోదీ
పరుగులు పెట్టిన PMO డాక్టర్లు

0
734

శనివారం మిట్టమధ్యాహ్నం.. అసోంలోని బక్సా జిల్లా తముల్పూర్.. లక్షలాది జనంతో బీజేపీ మూడో విడత ఎన్నికల ప్రచార సభ కిక్కిరిసిపోయింది.అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు. ఎండ వేడిని సైతం లెక్క చేయకుండా మనకు ప్రజలు మోదీ ప్రసంగాన్ని శ్రద్ధంగా వింటున్నారు. తెలుసు ప్రధాని మోదీ ప్రసంగం మొదలు పెడితే.. సభికులు మంత్రముగ్ధులైపోతారు. ఓవైపు ప్రతిపక్షాలను విమర్శిస్తూనే.. తాము చేయబోయే పనులను సూటిగా సుత్తిలేకుండా చెప్పడంలో మోదీ తరువాతే ఎవరైనా. ఆయన ప్రసంగం గంగా ప్రవాహంలా సాగుతూనేవుంటుంది. అలాంటి మొట్టమొదటిసారి తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు మోదీ. ప్రధానిగా గత ఏడేళ్లలో ఆయన ఏ బహిరంగ సభలో పాల్గొన్నా.. తన ప్రసంగాన్ని మధ్యలో ఆపిందిలేదు. కానీ, కార్యకర్త కోసం ఆయన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. సభలో పాల్గొన్న ఓ బీజేపీ కార్యకర్త ఎండదెబ్బకు కింద పడిపోవడాన్ని చూసి మోదీ ప్రసంగాన్ని ఆపేసి.. తనతో పాటు వచ్చిన పీఎంవో వైద్య సిబ్బందికి ఆదేశాలిచ్చారు.

ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని ఎక్కడ పర్యటించినా.. ఆయన వెంటన నిపుణులైన నలుగురు డాక్టర్ల బృందం కూడా విధిగా వెళుతుంది. అందులో ప్రధాని వ్యక్తిగత వైద్యుడు, పారామెడిక్, సర్జన్ ఇంకా క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఉంటారు. తముల్పూర్ ఎన్నికల ప్రచార సభలో బీజేపీ కార్యకర్త హరిచరణ్ దాస్ వడదెబ్బ తగిలి కింద పడిపోవడాన్ని గమనించిన మోదీ.. ప్రసంగాన్ని ఆపేసి, పీఎంవో డాక్టర్లను పిలిచారు. నాతోపాటు ఇక్కడికొచ్చిన పీఎంవో డాక్టర్లు వెంటనే ఇటు రండి.. బహుశా డీహైడ్రేషన్ తో బాధపడుతోన్న ఆ కార్యకర్తకు దయచేసి సాయం చేయండి అని ప్రధాని సూచించారు. దీంతో వెంటనే స్పందించిన పీఎంవో వైద్య సిబ్బంది హరిచరణ్ దాస్ ను పరిశీలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కోలుకున్న ఆ బీజేపీ కార్యకర్తను పార్టీ నేతలు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీజేపీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. మోదీ చర్యపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కార్యకర్తల పట్ల ప్రధాని మోదీకి ఉన్న అభిమానానికి ఇదే తార్కాణమని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఓవైపు అనర్ఘలంగా ప్రసంగిస్తూనే.. అంతమంది జనంలో ఓ కార్యకర్త కిందపడిపోవడాన్ని గమనించడం.. మోదీ సునిశిత దృష్టికి నిదర్శనం.

ఇక, బీజేపీ కార్యకర్తకు పీఎంవో వైద్యుల చికిత్స అందించిన తర్వాత.. మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. బీజేపీ అందరి కోసం పనిచేస్తుందని, కానీ, కొన్ని పార్టీలు కొందరి కోసమే పనిచేస్తాయని విపక్షాలపై విరుచుకుపడ్డారు మోదీ. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వారు దేశాన్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అందరి కోసం పనిచేసే పార్టీపై మతతత్వ ముద్రవేశారని.. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే పార్టీలను లౌకిక పార్టీలంటూ పిలుస్తున్నారని, అది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం.. అసోం ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేసేందుకు కృషి చేస్తోందన్నారు. దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన అవసరం తెలిపారు. అసోం ప్రజలు ఎన్డీయేకే ఓటేసేందుకు నిర్ణయించుకున్నారని అన్నారు. అసోం గుర్తింపును పోగొట్టి, హింసకు పాల్పడే పార్టీలను వారు సహించబోరని తేల్చి చెప్పారు. ఇదిలావుంటే, సభ ముగిసిన తర్వాత.. అస్వస్థతకు గురైన హరిచరణ్ దాస్ ఆరోగ్యం గురించి మోదీ వాకబు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పినట్టు సమాచారం.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

4 − 3 =