National

ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న భారత్: మోదీ

శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర చమురు, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ, కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి భారత దేశం ఆదర్శంగా నిలుస్తోందని.. గడచిన ఏడు సంవత్సరాల్లో భారత దేశ పునరుద్ధరణీయ ఇంధన సామర్థ్యం 250 శాతం కన్నా ఎక్కువ పెరిగిందన్నారు. ‘Report of the Expert Committee on Road Map for ethanol blending in India 2020-2025’ పెట్రోల్ ఇథనాల్ వాడకంపై నిపుణులు ప్రతిపాదించిన రోడ్ మ్యాప్ ను మోదీ విడుదల చేశారు. ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ ఇండియా, 2020-25 కోసం రోడ్ మ్యాప్‌పై నిపుణుల కమిటీ నివేదికను మోదీ ఆవిష్కరించారు. ఇథనాల్ ఉత్పత్తి, దేశవ్యాప్తంగా పంపిణీకి సంబంధించిన ఈ-100 పైలట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. పెట్రోలియం, అటవీ పర్యావరణ శాఖలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పర్యావరణ పరిరక్షణపై వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులతో ఇథనాల్ కలిపిన పెట్రోల్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రోగ్రామ్ కు సంబంధించి మాట్లాడారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకుంటూనే ఆర్థిక రంగాన్ని ముందుకు తీసుకెళ్లేలా పనిచేస్తున్నామన్నారు. పర్యావరణాన్ని కాపాడడం కోసం అభివృద్ధి పనులను ఆపాల్సిన అవసరం లేదని చెప్పేందుకు ప్రపంచం ముందు ఎన్నో ఉదాహరణలు భారత్ పెట్టిందన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించే విషయంలో ప్రపంచం ముందు భారత దేశం ఓ ఉదాహరణగా నిలుస్తోందని చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించే సమయంలో అభివృద్ధి పనులను నిలిపేయవలసిన అవసరం లేదని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థ ఒకదానితో మరొకటి కలిసి ప్రయాణించగలవన్నారు. ఆరేళ్లలో సౌర విద్యుత్ సామర్థ్యం 15 రెట్లు పెరిగిందని ఆయన చెప్పారు. 2025 నాటికి 20% ఇథనాల్ ఉన్న పెట్రోల్ ను అందించేందుకు లక్ష్యాలు నిర్దేశించుకున్నామని మోదీ చెప్పారు. ఈ ఏడేళ్లలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అందుకున్నామన్నారు. పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 250 శాతం పెరిగిందని చెప్పారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం ప్లాంట్లు ఏర్పాటు చేసిన దేశాల జాబితాలో భారత్ టాప్ 5లో చోటు సంపాదించిందన్నారు. 21వ శతాబ్దపు భారత దేశం 21వ శతాబ్దపు ఆధునిక ఆలోచనలు, ఆధునిక విధానాల ద్వారా మాత్రమే ఇంధనాన్ని పొందుతుందని చెప్పారు. తన ప్రభుత్వం ప్రతి రంగంలోనూ ఈ ఆలోచనా విధానాలతోనే విధాన నిర్ణయాలను తీసుకుంటోందన్నారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్, ‘ఒన్ సన్, ఒన్ వరల్డ్, ఒన్ గ్రిడ్’ను సాకారం చేయడం, విపత్తుల నుంచి కోలుకునే సామర్థ్యంగల మౌలిక సదుపాయాలను వృద్ధి చేసుకోవడం కోసం కూటమిగా ఏర్పడటం వంటి వాటిలో గ్లోబల్ విజన్‌తో భారత దేశం ముందుకు వెళుతోందని.. వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్ళ గురించి భారత దేశానికి తెలుసునని చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 − six =

Back to top button