National

తల్లి పాదసేవలో ప్రధాని మోదీ.. ఈ రోజు ఇద్దరికి స్పెషలే..!

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అనే సామెత ఈ కరెక్టుగా సరిపోతుందేమో..! ప్రధాని నరేంద్ర మోదీ మాతృతల్లి హీరాబెన్ మోదీ శనివారం శత వసంతంలోకి అడుగుపెట్టారు. 1923, జూన్ 18న జన్మించిన హీరాబెన్…. ప్రస్తుతం ప్రధాని సోదరుడు పంకజ్ మోదీతో కలిసి ఉంటున్నారు.

ఇప్పటికే గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ.. తన తల్లి జన్మదినాన్ని పురస్కరించుకొని గాంధీనగర్‌లో ఆమెను కలిసి అశీర్వచనాలు తీసుకున్నారు. శుక్రవారం రాత్రే మోదీ అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. శనివారం ఉదయం తన తల్లి హీరాబెన్‌కు పాదపూజ నిర్వహించి.. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పాదాలకు నమస్కరించి, కాసేపు తల్లితో ప్రధాని ముచ్చటించారు. తల్లి జన్మదినం రోజున తప్పకుండా ఆమెను కలిసి, ఆశీర్వాదం తీసుకుంటారు ప్రధాని.

అనంతరం ప్రధాని అక్కడ నుంచి బయలుదేరి పంచమహల్ జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పావగఢ్‌కు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గుజరాత్ సమాచార శాఖ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం.. పదిహేనో శతాబ్దంలో నిర్మించిన పావగడ ఆలయ శిఖరం గత ఐదు శతాబ్దాలుగా శిథిలావస్థకు చేరుకుంది.. దీనిని ప్రస్తుతం పునరుద్దరించి కొత్త రూపంతో రీడిజైన్ చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం భక్తులను అనుమతిస్తారు. ఇక, ప్రధాని తల్లి పుట్టినరోజు నేపథ్యంలో గుజరాత్‌లోని ఓ రోడ్డుకు ఆమె పేరు పెట్టనున్నారు. హీరాబెన్ 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నందున, రైసెన్ ప్రాంతంలోని 80 మీటర్ల రహదారికి పూజ్య హీరాబా మార్గ్ అనే పేరు పెట్టాలని తాము నిర్ణయించుకున్నామని.. తద్వారా ఆమె జీవితం నుంచి తరువాతి తరం స్ఫూర్తి పొందుతుందని గాంధీనగర్ మేయర్ హితేష్ మక్వానా వెల్లడించారు.

అయితే తల్లిని కలవడానికి ఆమె ఆశీర్వాదాలు తీసుకోవడానికి ప్రధాని మోడీ తరచుగా వెళ్తూ ఉంటారు. ఏదైనా పెద్ద పని చేపట్టడానికి ముందు, ఎన్నికల సమయంలో, ప్రధాని మోడీ తన తల్లి హీరాబెన్ నుంచి ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోరు. ఇక మన ఇరుగుపొరుగున ఎవరైనా ముఖ్యులు, వార్డు కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు అయితే, వారి బంధువులు తమను తాము ప్రత్యేకంగా భావించడం ప్రారంభిస్తారు. చాలా మంది ఇతరులను బెదిరిస్తారు కూడా మరికొందరు ఇతరుల నుంచి అదనపు ప్రయోజనాన్ని పొంది డబ్బు సంపాదించడం ప్రారంభిస్తారు. అయితే ప్రధాని మోడీ కుటుంబ సభ్యులు, వారి బంధువులు ఇప్పటికీ తమ పాత జీవితాన్ని గడుపుతున్నారు.

ప్రధాని మోడీకి ఒకే ఒక్క సోదరి ఉంది. వాసంతీబెన్ హస్ముఖ్ లాల్ మోడీ. ఆమె గృహిణి. ఆమె భర్త పేరు హస్ముఖ్ భాయ్. అతను LIC అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్నాడు. మోడీ పెద్ద సోదరుడి పేరు సోమ మోడీ. అతను ఆరోగ్య శాఖలో విధులను నిర్వహించి పదవీ విరమణ చేసి అహ్మదాబాద్‌లో వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నాడు. నరేంద్ర మోడీ రెండవ సోదరుడి పేరు ప్రహ్లాద్ మోడీ. ఆయన ప్రధాని మోడీ కంటే రెండేళ్లు చిన్నవాడు. అతనికి అహ్మదాబాద్‌లో కిరాణా దుకాణం, టైర్ షోరూమ్ కూడా ఉంది. నరేంద్ర మోడీ మూడో సోదరుడి పేరు అమృత్ భాయ్ మోడీ. ఓ ప్రైవేట్ కంపెనీలో ఫిట్టర్‌గా విధులను నిర్వహించి ఉద్యోగ విరమణ పొందాడు. పదవీ విరమణ తర్వాత అహ్మదాబాద్‌లోని నాలుగు గదుల ఇంట్లో సాధారణ జీవితం గడుపుతున్నారు. అతని భార్య చంద్రకాంత్ బెన్ గృహిణి. అతనితో పాటు, 47 ఏళ్ల కుమారుడు సంజయ్ కూడా తన భార్య , ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడు. సంజయ్‌కి సొంతంగా చిన్న వ్యాపారం ఉంది.

నరేంద్ర మోడీ తమ్ముడు పంకజ్ భాయ్ మోడీ గాంధీనగర్‌లో నివసిస్తున్నారు. అతని భార్య పేరు సీతాబెన్. సమాచార శాఖలో పనిచేసి పదవీ విరమణ చేశారు. తల్లి హీరాబెన్‌తో కలిసి జీవిస్తున్న అదృష్టవంతులు పంకజ్. ప్రధాని మోడీ తన తల్లిని కలవడానికి వెళ్ళినపుడు తన తమ్ముడు పంకజ్ ను కలుస్తూనే ఉంటారు. నరేంద్ర మోడీ బాబాయ్ నర్సింహ దాస్ మోడీ కుమారుడు భరత్‌భాయ్ మోడీ వాద్‌నగర్‌కు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాధారణ పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. నరేంద్ర మోడీ రెండవ దాయాదులు కూడా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. వారు ప్రధాని మోడీ సోదరుడిగా అధికార దర్పాన్ని ప్రదర్శించలేదు. అదే విధంగా మోడీ పేరుతో ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించలేదు. ప్రధాని మోడీ బంధువులు సామాన్యులలాగే జీవిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

1 × three =

Back to top button