More

    జీ20 సదస్సుకు ప్రధాని మోదీ.. రిషి సునాక్ తో భేటీ

    భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ20 సదస్సుకు వెళ్లనున్నారు. ఇండోనేషియాలోని బాలిలో జీ-20 సదస్సు ఈ నెల 15,16 తేదీల్లో జరగనుంది. ప్రపంచ జీడీపీలో దాదాపు 85 శాతం, జనాభాలో మూడింట రెండొంతుల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న 20 దేశాల అధినేతలకు ఆతిథ్యం ఇవ్వనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఇండోనేషియాలోని బాలికి వెళ్లనున్నారు. ఇండోనేషియా అధ్యక్షతన జరగనున్న 17వ జీ20 లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు తాను నవంబర్ 14 నుంచి 16 వరకు ఇండోనేషియాలోని బాలిని సందర్శించనున్నట్టుగా ప్రధాని మోదీ తెలిపారు. జీ20 సమ్మిట్ సమావేశంలో పాల్గొనే అనేక ఇతర దేశాల నాయకులతో సమావేశం కానున్నట్టుగా తెలిపారు. వారితో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించనున్నట్టుగా పేర్కొన్నారు. నవంబర్ 15 న రిసెప్షన్‌లో బాలిలోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి ఎదురుచూస్తున్నానని తెలిపారు.

    ఈ సదస్సులో భాగంగా ప్రధానమంత్రి మోదీ బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ తో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంధన భద్రత, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్, ఆహరం, ఆరోగ్యం వంటి కీలక సమావేశాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అలాగే పలు దేశాల నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.

    Trending Stories

    Related Stories