National

ప్రధాని మోదీ ప్రపంచానికే స్ఫూర్తిదాయకం: డెన్మార్ ప్ర‌ధాని

డెన్మార్ ప్ర‌ధాని మెట్టె ఫ్రెడెరిక్స‌న్‌కు నేడు భారత్ కు చేరుకున్నారు. మూడు రోజుల భారత పర్యటన కోసం ఆమె శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి మినాక్సీ లేఖి ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం పలికారు. మాట్ ఫ్రెడెరిక్సన్ అక్టోబర్ 9 నుండి 11 వరకు భారతదేశంలో పర్యటించనున్నారు.

ఇక ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ఆమెకు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆమెకు స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌ర్వాత ఆమెకు గౌర‌వ వంద‌నం ల‌భించింది. ఈ పర్యటనలో ఆమె ప్ర‌ధాని మోదీ, రాష్ట్ర‌ప‌తి కోవిడ్‌తో ఆమె ద్వైపాక్షిక చ‌ర్చ‌ల్లో పాల్గొంటారు. భార‌త్‌ను స‌న్నిహిత భాగ‌స్వామిగా గుర్తిస్తామ‌ని ఫ్రెడెరిక్స‌న్ తెలిపారు. డెన్మార్క్‌-భార‌త్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఈ ప‌ర్య‌ట‌న ఓ మైలురాయిగా మిగులుతుంద‌ని ఆమె చెప్పారు.

ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని ఫ్రెడెరిక్సెన్ అన్నారు. ప్రపంచంలోని మిగిలిన దేశాలకు స్ఫూర్తిదాయకం, ఎందుకంటే ఒక మిలియన్ గృహాలకు పరిశుభ్రమైన నీరు అందించడంతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నారని పొగడ్తలు గుప్పించారు. రెండు ప్రజాస్వామ్య దేశాలు నియమాల ఆధారంగా అంతర్జాతీయంగా అనేక దేశాల వ్యవస్థలు నడుస్తున్నాయని ఫ్రెడెరిక్సెన్ అన్నారు. భారతదేశం – డెన్మార్క్ మధ్య సహకారం మరింత మెరుగుపడాలని ఆమె ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలను మార్చుకున్నారు.

భారతదేశం – డెన్మార్క్ మధ్య హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం రెండు దేశాలలో సుదూర ఆలోచనలకు చిహ్నమని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం – డెన్మార్క్ మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్‌ను స్థాపించడానికి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని మోదీ తెలిపారు. ఇది మన రెండు దేశాలలో పర్యావరణం పట్ల సుదూర ఆలోచనకు, గౌరవానికి సంకేతం అని మోదీ అన్నారు. మా రెండు దేశాల మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని మోదీ తెలిపారు.

Related Articles

Back to top button