విశాఖ టూర్లో ప్రధాని మోదీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏపీ ప్రజలకు దేశంలోనే కాదు…ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. అన్ని రంగాల్లో వారి ప్రత్యేకత చాటుకుంటున్నారన్న ప్రధాని… స్వాభావ రీత్యా స్నేహపూర్వకంగా ఉంటారన్నారు. ప్రతీ రంగంలో మెరుగైన మార్పుకోసం తెలుగు ప్రజలు తపన పడతారన్నారు. సాంకేతిక వైద్య రంగంలో ఏపీకి ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇవాళ రూ.10వేల కోట్లతో ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నామన్నారు.