రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ప్రధాని మోదీ.. దానికి ముందు..!

0
784

ప్రధాని నరేంద్రమోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే.. రాష్ట్రపతి ఎన్నికల వేళ ఆయన తన ఓటును వేశారు.

రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొన‌సాగుతోంది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ స‌హా ప‌లువురు కేంద్ర మంత్రులు ఓటు వేశారు. అలాగే, రాష్ట్రాల్లోనూ ప‌లువురు ప్ర‌ముఖులు ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

అలాగే పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఓటు వేసేముందు మోదీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రప‌తి, ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ ఈ పార్ల‌మెంటు స‌మావేశాలు మ‌రింత ప్రాధాన్యం సంత‌రించుకున్నాయ‌ని చెప్పారు. ఇదే స‌మ‌యంలో అజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ జ‌రుపుకుంటున్నామ‌ని తెలిపారు.

త్వ‌ర‌లో పంద్రాగ‌స్టు రానుంద‌ని గుర్తుచేశారు. 25 ఏళ్ళ‌లో దేశం 100వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకుంటుంద‌ని చెప్పారు. మన ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తూ, దేశాన్ని మ‌రింత ఉన్న‌త‌స్థాయికి తీసుకెళ్ళ‌డానికి తీర్మానాలు చేసుకోవాల్సిన స‌మయం ఇద‌ని ఆయ‌న అన్నారు. కాగా, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప‌లువురు ప్ర‌ముఖులు రాష్ట్రప‌తి ఎన్నిక‌లో ఓటు వేశారు. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్, ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. అలాగే, రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ఓట్లు వేయ‌డానికి క్యూ క‌ట్టారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

eighteen + twelve =