More

    ఆపరేషన్ గంగా.. భారత ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దిగమన్న ప్రధాని మోదీ

    ఉక్రెయిన్ నుండి భారతీయులను తరలించడంలో సహాయం చేయవలసిందిగా ప్రధాని నరేంద్ర మోదీ భారత వైమానిక దళాన్ని కోరినట్లు తెలుస్తోంది. భారత వైమానిక దళం సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటే తక్కువ సమయంలోనే ఎక్కువ మందినిఖాళీ చేయవచ్చని అధికారులు తెలిపారు. ఇది మానవతా సహాయాన్ని మరింత సమర్థవంతంగా అందించడంలో కూడా సహాయపడుతుందని భారత ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

    భారత వైమానిక దళం ఈరోజు నుండి ఆపరేషన్ గంగాలో భాగంగా C-17 విమానాలను మోహరించనుంది. ప్రధాని ఆదేశాల నేపథ్యంలో ఎయిర్ ఫోర్స్ సీ-17 విమానాలను రంగంలోకి దించనుంది. సీ-17 యుద్ధ విమానం ఒకటి కనీసం 1,000 మందిని చేరవేయగలదు. సీ-17 విమానం గంటకు 950 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈరోజు తెల్లవారుజామున 182 మంది భారతీయులతో కూడిన ఎయిర్ ఇండియా విమానం ముంబైలో దిగింది. ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసివేసినందున ఈ విమానం రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుండి భారత్ కు చేరుకుంది. ఈ రోజు మరో రెండు ఇతర తరలింపు విమానాలు భారతీయులను తీసుకురానున్నాయి. ఒకటి బుకారెస్ట్ నుండి ఇంకొకటి హంగేరి రాజధాని బుడాపెస్ట్ నుండి రానున్నాయి. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఒక్కటే విమానాల ద్వారా భారతీయులను తీసుకువస్తోంది. దీంతో తరలింపును మరింత వేగవంతం చేసేందుకు ఎయిర్ ఫోర్స్ సాయాన్ని ప్రధాని కోరారు.

    ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి భారతీయులు అందరూ వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని అక్కడి భారత రాయబార కార్యాలయం సూచన జారీ చేసింది. భారతీయ విద్యార్థులు, భారత జాతీయులు అందరూ రైళ్లు లేదా ఇతర మార్గాలలో ఈ రోజే కీవ్ ను వీడాలని కోరింది. ఉక్రెయిన్ పొరుగు దేశాలైన రొమేనియా, స్లోవాక్ రిపబ్లిక్‌లోని ఆయా దేశాల అధికారులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఉక్రెయిన్‌లో ఉన్న 20,000 మంది భారతీయ పౌరులలో సుమారు 8,000 మంది ఈ నెల ప్రారంభంలోనే విడిచిపెట్టినట్లు భారత ప్రభుత్వం తెలిపింది.

    Trending Stories

    Related Stories