National

మరోసారి మోదీనే ‘కింగ్’

మోదీ మేనియా గురించి ఆయన చరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా..! ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. ఎన్నో శక్తులు ఆయనపై విష ప్రచారం చేసినా.. ఎందరో నేతలు ఆయన మీద అసత్యాలను ప్రచారం చేసినా ఆయన చరిష్మాను ఏ మాత్రం తగ్గించలేకపోతున్నారు. తాజాగా కూడా అదే రుజువైంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను వెనక్కు నెట్టి మరీ నరేంద్ర మోదీనే అగ్రస్థానాన్ని సంపాదించారు. అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ 66 శాతం రేటింగ్ సంపాదించారు. ఇతర గ్లోబల్ లీడర్ల కంటే ముందంజలో ఉంది. అమెరికా, యుకె, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీలతో సహా 13 దేశాల ప్రపంచ నాయకుల కంటే ప్రధాని మోదీ ముందున్నారని ‘మార్నింగ్ కన్సల్ట్’ సంస్థ తెలిపింది. ప్రపంచంలో మంచి చరిష్మా ఉన్న నేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీనే అగ్రస్థానాన్ని సంపాదించారు. జో బైడెన్ సహా 13 అగ్రదేశాధినేతల కన్నా ప్రధాని మోదీనే ముందు ఉన్నారు.

‘మార్నింగ్ కన్సల్ట్’ అనే సంస్థ చేసిన సర్వేలో 66 శాతం మంది ప్రధాని నరేంద్ర మోదీనే మళ్లీ దేశాధినేతగా కావాలని కోరుకుంటున్నారని స్పష్టమైంది. ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్’ పేరిట ఆ సర్వే ఫలితాలను మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది. భారత్ లో 2,126 మందిని సర్వే చేస్తే అందులో 66 శాతం మంది.. ప్రధాని మోదీకే జై కొట్టారు. మరో 28 శాతం మంది వ్యతిరేకతను వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే కాస్త ఈ ఏడాదిలో ఆయన స్కోరు పడిపోయినట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి హోదా కల్పించే 370 అధికరణాన్ని రద్దు చేసిన ఆగస్టు 2019లో ఆయన్ను 82 శాతం మంది ఆమోదించారని వెల్లడించింది. అప్పట్లో కేవలం 11 శాతం మందే మోదీని వ్యతిరేకించారు. ఇప్పుడు జన ఆమోదం16 శాతం పడిపోయింది.

65 శాతం మంది ఆమోదంతో మోదీ తర్వాతి స్థానంలో ఇటలీ ప్రధాని మారియో ద్రాఘీ ఉన్నారు. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానంలో ఉన్నారు. ఆయన్ను 53 శాతం మంది ఎంచుకున్నారు. మూడో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రూస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ (63%) ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ (54%), జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ (53%), కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడూ (48%), బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (44%), దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ (37%), స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ (36%), బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో (35%), ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ (35%), జపాన్ ప్రధాని యోషిహిదే సూగా (29%) ఉన్నారు. వారం రోజుల సగటు ఆధారంగా ఈ సర్వే ఫలితాలను వెల్లడించినట్టు మార్నింగ్ కన్సల్ట్ పేర్కొంది. సర్వేను ఆన్ లైన్ లో చేపట్టినట్లు తెలిపింది. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ.. పొలిటికల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ద్వారా ఈ డేటాను సేకరిస్తుంది. అధికారిక ప్రభుత్వ వనరుల ఆధారంగా వయస్సు, లింగం, ప్రాంతం,విద్య ఆధారంగా ప్రతి దేశంలో సర్వేలు జరిపామని మార్నింగ్ కన్సల్ట్ తెలిపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 + twelve =

Back to top button