కొద్దిరోజుల నుంచి తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్లు తెలంగాణకు క్యూ కట్టడంతో.. పాలిటిక్స్ జోరందుకుంది. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెంచింది.
మరోవైపు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై కసరత్తును ప్రారంభించింది. ఈ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించునున్నారు. ఇందులో భాగంగా బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.ఎల్. సంతోష్ నగరానికి వచ్చారు. కాగా, మూడు రోజల పాటు జరిగే ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో పాటుగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు.
కాగా.. లక్ష్మణ్‌ను రాజ్యసభకు పంపడం ద్వారా బీజేపీ తమకు రెండు రకాలుగా ప్రయోజనం కలుగుతుందని భావిస్తోంది. తెలంగాణలోని బీసీకి తాము మరో రాష్ట్రం ద్వారా రాజ్యసభకు పంపాలని చెప్పుకునేందుకు ఆ పార్టీకి అవకాశం దక్కుతుంది. ఇక టీఆర్ఎస్ తరహాలో పార్టీలో పని చేయని వారికి టికెట్ ఇచ్చే సంస్కృతికి తమది కాదని.. అందుకే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న లక్ష్మణ్‌కు అవకాశం ఇచ్చామని చెప్పుకోవడానికి ఆ పార్టీకి అవకాశం కలుగుతుంది.
యూపీ నుంచి తెలంగాణ వ్యక్తిని రాజ్యసభకు పంపడం ద్వారా తాము తెలంగాణపై ఏ స్థాయిలో ఫోకస్ చేస్తున్నామో చెప్పకనే చెప్పింది. ఈ రకమైన నిర్ణయం ద్వారా తెలంగాణ కేడర్‌లోనూ జోష్ నింపింది. మొత్తానికి ఉత్తరప్రదేశ్ కోటాలో తెలంగాణకు చెందిన లక్ష్మణ్‌ను రాజ్యసభకు పంపిన బీజేపీ.. ఈ నిర్ణయం ద్వారా టీఆర్ఎస్‌కు అనేక సవాళ్లు విసరడంతో పాటు తెలంగాణపై తమ ఫోకస్ మరింతగా పెరిగిందని చెప్పకనే చెప్పింది.