More

    ప్రధాని మోదీ దేశభక్తిపై ప్రశంసల వర్షం కురిపించిన పుతిన్

    భారత ప్రధాని మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు కురిపించారు. మోదీ దేశభక్తుడని.. ఆయన నాయకత్వంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలో భారత్ ఎంతో సాధించిందని అన్నారు. ‘మేకిన్ ఇండియా’ అనేది మోదీ అద్భుతమైన ఆలోచన అని… ఇది ఆర్థికపరంగానే కాకుండా, నైతికపరంగా కూడా చాలా గొప్ప కార్యక్రమమని అన్నారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పారు. బ్రిటిష్ కాలనీ నుంచి ఒక సార్వభౌమాధికార దేశంగా భారత్ ఎంతో సాధించిందని అన్నారు. భారత్ తో రష్యాకు ప్రత్యేకమైన బంధాలు ఉన్నాయని పుతిన్ చెప్పారు. ఎన్నో దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య బలమైన స్నేహం ఉందని అన్నారు. రెండు దేశాల మధ్య ఎప్పుడూ ఏ సమస్య కూడా రాలేదని… ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఇరు దేశాలు సహకరించుకుంటున్నాయని చెప్పారు. ప్రపంచ రాజకీయాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పుతిన్ అన్నారు. ఇండియాతో రష్యాకు ఎలాంటి సమస్య లేదని.. అన్ని విషయాల్లో పరస్పరం సహకరించుకుంటున్నట్లు చెప్పారు. భవిష్యత్ లోనూ ఇది కొనసాగుతుందన్నారు. ఉక్రెయిన్ పై అణ్వాస్త్రాలను ప్రయోగించాలన్న ఉద్ధేశం తమకు లేదని పుతిన్ స్పష్టం చేశారు. ప్రపంచంపై ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు పశ్చిమ దేశాలు సాగిస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఉక్రెయిన్ సంక్షోభం తలెత్తిందన్నారు.

    Trending Stories

    Related Stories