National

వెంటిలేటర్ల సంఖ్య మూడు రెట్లు పెరగడానికి కారణమైన పిఎం కేర్స్ ఫండ్స్

భారతదేశం ప్రస్తుతం కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ను ఎదుర్కొంటూ ఉంది. ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం తన వంతుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. పి.ఎం. కేర్స్ ఫండ్స్ ద్వారా ఎన్నో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉన్న పబ్లిక్ ఆసుపత్రులకు వెంటిలేటర్లను అందించారు. వీటి ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడడం కూడా జరిగింది.

కరోనా మహమ్మారి భారతదేశంలో ఎంటర్ అవ్వకముందు పబ్లిక్ హాస్పిటల్స్ లో ఉన్న వెంటిలేటర్ల సంఖ్య 16000 మాత్రమే..! గతేడాది భారత్ లో కరోనా కేసులు నమోదైనప్పటి నుండి పిఎం కేర్స్ ఫండ్స్ ద్వారా 43800 కొత్త వెంటిలేటర్లను అందించారు. పిఎం కేర్స్ ఫండ్స్ ద్వారా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో వెంటిలేటర్లను ఇన్స్టాల్ చేశారు.

పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటకల్లో వెంటిలేటర్లు చాలా తక్కువగానే ఉండేవి. పిఎం కేర్స్ ఫండ్స్ ద్వారా ఆయా రాష్ట్రాలకు కావాల్సిన వెంటిలేటర్లను అందించగలిగారు. కేంద్ర ప్రభుత్వం ఈ వెంటిలేటర్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటిలేటర్లను వాడుకోవడంలో విఫలమయ్యాయి. మరో వైపు వెంటిలేటర్ల వ్యవహారంపై మోదీ ఆడిట్ కు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం పంపిన వెంటిలేటర్లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సరిగా వినియోగించుకుంటున్నాయో లేదో తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. వెంటిలేటర్లను సరిగా వినియోగించుకోవాలని.. మెయింటెనెన్స్ విషయంలో అధికారులు చొరవ చూపాలని కోరారు.

గత ఏడాది కాలంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బి.ఈ.ఎల్.) 30000కు పైగా వెంటిలేటర్లను తయారు చేయగా.. వాటిని చాలా రాష్ట్రాలకు పంపించారు. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ వెంటిలేటర్లు సరిగా పనిచేయడం లేదంటూ పక్కన పడేశాయి. సెకండ్ వేవ్ సమయంలో కూడా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వీటిని వినియోగించాలని భావించలేదు. చిన్న రిపేరీలు, మెయిన్టెనెన్స్ తోడైతే ఈ వెంటిలేటర్లు పని చేస్తూ ఉండేవి.. కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పట్టించుకోలేదు. పంజాబ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు తమకు కేంద్ర ప్రభుత్వం పని చేయని వెంటిలేటర్లు పంపాయని ఆరోపించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం బృందాన్ని పంపగా.. చిన్న చిన్న రిపేరీలు చేయడంతోనే అవి పని చేయడం ఆరంభించాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం వాటి గురించి పట్టించుకోకుండా.. మెయింటెనెన్స్ అన్నదే లేకుండా ఉండడం వలన పని చేయడం మానేశాయని గుర్తించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద నిందలు మోపడం మొదలు పెట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 3 =

Back to top button