More

    మోదీజీ టికెట్ కొని ఎక్కారు.. మనం చాలా నేర్చుకోవాలి ఆయన్ను చూసి: దేవేంద్ర ఫడ్నవీస్

    ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పుణె మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించారు. స్వయంగా టికెట్ కొనుగోలు చేసిన ఆయన మెట్రో రైలులో గార్వేర్ నుంచి ఆనంద్ నగర్ స్టేషన్ వరకు ప్రయాణించారు. ప్రధాని వెంట విద్యార్థులు కూడా ఉన్నారు.

    పూణే మెట్రో ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ పూణే మెట్రోలో మెట్రో టిక్కెట్‌ను కొనుగోలు చేయనందుకు క్షమాపణలు చెప్పారు. 2014లో మహారాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్‌ పూణే మెట్రో ప్రాజెక్టును ప్రారంభించారు. ఆదివారం నాడు మెట్రో ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ మెట్రో మొదటి టికెట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మొబైల్ పేమెంట్ ద్వారా కొనుగోలు చేశారు, ఆయన మెట్రోలో ప్రయాణించారు. మేము ఎటువంటి టిక్కెట్టు తీసుకోకుండా ప్రయాణించినందుకు మాకు సిగ్గుగా ఉంది. దయచేసి మా నుండి టికెట్ డబ్బులను వసూలు చేయవలసిందిగా నేను మెట్రో అధికారులను కోరారు. ప్రధానమంత్రి టిక్కెట్‌ కొన్నారు, మేము టిక్కెట్టు లేకుండానే ప్రయాణం చేయడం మంచి విషయం కాదన్నారు ఫడ్నవీస్. “మెట్రో ప్రాజెక్టు విషయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మహా మెట్రో సంస్థ రికార్డు బ్రేక్ టైమ్‌లో పూణే మెట్రో ప్రాజెక్ట్‌ను పూర్తి చేసింది. పూణేలోని స్థానిక నదిని శుభ్రపరిచే ప్రాజెక్ట్‌ను ఆమోదించినందుకు ప్రధానికి ధన్యవాదాలు. మున్సిపల్ ప్రాంతాలలో ఎలక్ట్రిక్, CNG బస్సులను ఉపయోగించబోతున్నాం” అని ఫడ్నవీస్ చెప్పుకొచ్చారు. తన అభ్యర్థన మేరకు నాసిక్‌లో మెట్రో ప్రాజెక్ట్, నాగ్‌పూర్ మెట్రో రెండవ దశను ప్రధాని మోదీ ఆమోదించారన్నారు. అందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

    ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని విజయవంతంగా మేనేజ్ చేయగలిగామని, కానీ ఇప్పుడు ఉక్రెయిన్ సంక్షోభం వచ్చిపడిందని అన్నారు. అయితే, అగ్రరాజ్యాలు సైతం వారి పౌరులను ఉక్రెయిన్ నుంచి తరలించేందుకు ఇబ్బందులు పడుతున్న వేళ, భారత్ మాత్రం సురక్షితంగా తరలిస్తోందని అన్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులను సమర్థవంతంగా స్వదేశానికి తరలిస్తుండడం అంతర్జాతీయంగా భారత్ పలుకుబడి పెరిగిందన్న దానికి నిదర్శనం అని చెప్పారు.

    పూణే మెట్రో రైలు ప్రాజెక్టు మొత్తం నిడివి 32.2 కిలోమీటర్లు కాగా, తొలి దశ కింద 12 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తయింది. వనజ్ నుంచి గార్వేర్ కాలేజ్ మెట్రో స్టేషన్ వరకు, పీసీఎంసీ నుంచి ఫుగెవాడి మెట్రో స్టేషన్ వరకు రెండు మార్గాల్లో మెట్రో రైళ్లు నడవనున్నాయి.

    Trending Stories

    Related Stories