More

    ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ కు జస్ట్ మిస్ అయిన వాటర్ బాటిల్

    ఢిల్లీ సిఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌లో పర్యటిస్తూ ఉన్నారు. రాజ్‌కోట్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో ఆప్ అధినేతపై బాటిల్ విసిరారు. గర్బా ఉత్సవంలో పాల్గొనేందుకు రాజ్‌కోట్‌కు వచ్చిన ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి వాటర్ బాటిల్ విసిరాడు. అయితే బాటిల్ కేజ్రీవాల్ కు తగలలేదు. కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని వెనక నుంచి విసిరిన వాటర్ బాటిల్ ఆయనను దాటుకుని వెళ్లిపడింది. అయితే, ఈ విషయాన్ని కేజ్రీవాల్‌ పట్టించుకోలేదు. కేజ్రీవాల్‌ ప్రజలకు అభివాదం తెలుపుతున్న సమయంలో వెనక నుంచి ఆయన వైపుగా ఓ వాటర్ బాటిల్ దూసుకొచ్చింది. కేజ్రీవాల్ వైపుగా దూసుకొస్తున్న వాటర్ బాటిల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

    గుజరాత్ లో కేజ్రీవాల్ రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబరులో జరగాల్సి ఉంది. అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో పర్యటిస్తూ హామీల వర్షం కురిపిస్తున్నారు. ఆప్ ముఖ్యనేతలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీబిజీగా ఉంటున్నారు. గుజరాత్ లో కేజ్రీవాల్ ప్రకటిస్తున్న ‘ఉచితాలు’ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

    Trending Stories

    Related Stories