తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరుగుతుండగా.. సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. పేట్ బషీరాబాద్ లో కొందరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పేట్ బషీరాబాద్ లో పట్టుబడినవారు సుపారీ కిల్లర్స్ అని భావిస్తున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు.
మంత్రి హత్య కుట్రలో భాగస్వామి రఘును ఢిల్లీలో బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసంలో అరెస్ట్ చేశారు. రఘుకు ఆశ్రయమిచ్చిన ముగ్గురు వ్యక్తులను ప్రశ్నించి వదిలేశారు. ఈ హత్య కుట్ర వివరాలను సైబరాబాద్ పోలీసులు ఢిల్లీ పోలీసులతో పంచుకున్నారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు ఓ సుపారీ గ్యాంగ్ రంగంలోకి దిగినట్టు గుర్తించిన సైబరాబాద్ పోలీసులు, వారిని పేట్ బషీరాబాద్ లో అరెస్ట్ చేశారు. వారిని విశ్వనాథ్, నాగరాజు, యాదయ్యలుగా గుర్తించారు. వీరు మహబూబ్ నగర్ కు చెందినవారుగా భావిస్తున్నారు. వారికి గతంలో నేర చరిత్ర ఉన్నట్టు గుర్తించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కోసం సదరు సుపారీ గ్యాంగ్ ఫరూక్ అనే వ్యక్తితో రూ.12 కోట్లకు ఒప్పందానికి ప్రయత్నించింది. ఫరూక్ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర బయటకు వచ్చింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్ గౌడ్ ను కూడా సుపారీ గ్యాంగ్ టార్గెట్ చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హత్య కుట్రపై పేట్‌బషీరాబాద్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ ప్లాన్‌లో భాగస్వాములైన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ముగ్గురు ఇచ్చిన సమాచారంతో హత్య కుట్రలో భాగస్వామి అయిన మున్నూరు రవిని ఢిల్లీలోని బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి క్వార్టర్‌లో అరెస్ట్ చేశారు పోలీసులు.
శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్రకు పాల్పడిన వారిని అరెస్ట్ చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కుట్రకు రాఘవేంద్రరావు, మున్నూరు రవి, అమరేందర్రాజు, మధుసూదన్ రాజు, తాపా, వీరంతా మరో ముగ్గురితో కలిసి ప్లాన్ చేశారని తెలిపారు. ఇందుకు సంబంధించి రాఘవేంద్రరాజు మొదట ఫరూఖ్‌ను మొదట సంప్రదించాడని అన్నారు. ఈ మొత్తం డీల్‌కు రూ. 15 కోట్ల ఆఫర్ చేశాడని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. ఈ మొత్తం కుట్రలో భాగస్వామి అయిన 8 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. మాజీమంత్రి జితేందర్ రెడ్డికి ఈ కేసుకు సంబంధించి ఏమైనా ఇన్వాల్వ్‌మెంట్ ఉందా ? అని విచారణలో తేలాల్సి ఉందని అన్నారు. జితేందర్ రెడ్డి పీఏ రాజు, డ్రైవర్ తాపా నిందితులకు షెల్టర్ ఇచ్చారని అన్నారు. ఈ కుట్ర కోణంలో మాజీమంత్రి డీకే అరుణ పాత్రపై కూడా విచారణ చేపడుతున్నామని అన్నారు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నామని తెలుసుకున్న పలువురు నిందితులు మొదట విశాఖ, ఆ తరువాత ఢిల్లీ వెళ్లి అక్కడ తలదాచుకున్నారని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన నిందితుల గురించి అక్కడి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించామని అన్నారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందన్నారు.