మంచి భవిష్యత్తు కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నా: విజయా రెడ్డి

0
743

తెలంగాణ రాష్ట్ర సమితికి మాజీ మంత్రి పి. జనార్దన్ రెడ్డి (పీజీఆర్) కూతురు పి. విజయా రెడ్డి గుడ్ బై చెప్పారు. ఖైరతాబాద్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్ గా ఎన్నికైన విజయారెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు.ఈ విషయాన్ని విజయారెడ్డి స్వయంగా వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సమావేశమైన అనంతరం ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. మంచి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని తెలిపారు. పీజేఆర్ వారసత్వం కొనసాగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని.. ఈ నెల 23వ తేదీన కాంగ్రెస్ లో చేరుతానని తెలిపారు. తనకిప్పుడు ఇంటిపార్టీలోకి వస్తున్నాననే భావన కలుగుతోందని అన్నారు. పీజేఆర్ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన విజయారెడ్డి తర్వాత టీఆర్ఎస్ చేరారు. రెండు సార్లు కార్పొరేటర్ గా గెలిచారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఆశించిన ఆమెకు ఆ అవకాశం రాలేదు. టీఆర్ఎస్ లో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని విజయారెడ్డి వర్గం బహిరంగంగానే నిరాశను వ్యక్తం చేస్తోంది.