పావురానికి చైనా భాషలో ట్యాగ్.. ఏంటది..?

0
1007

రూర్కెలాలో కాళ్లపై బ్యాడ్జ్ ఉన్న పావురం కనిపించిన తర్వాత, ఒడిశాలోని పూరీ జిల్లా మాలతీపతాపూర్‌లో అలాంటి మరో పావురం దొరికింది. ఈ పావురం కాళ్లకు బ్యాడ్జ్ అమర్చడం వల్ల ఈ పక్షులను ఉపయోగించి చైనా గూఢచర్యం చేస్తోందని అనుమానిస్తున్నారు. రూర్కెలా నుండి పట్టుకున్న పావురం బ్యాడ్జ్‌పై రాసివున్న సంఖ్యకు.. పూరీలో పట్టుకున్న దానికి భిన్నంగా ఉంది. రూర్కెలాలో కనిపించే పావురానికి ఒక కాలులో ఒక రింగ్ ఉండగా, పూరీలో కనిపించే పావురానికి రెండు కాళ్లకు రెండు రింగ్స్ ఉన్నాయి. అంతేకాకుండా దాని నోటికి కొంత రసాయనం అతికించబడి ఉంది. వివిధ ప్రాంతాల్లో ఈ పక్షులు కనిపించాయి.. బ్యాడ్జ్‌లలో కొన్ని సంఖ్యలు కూడా కనిపించడంతో ఇవి గూఢచర్యం చేస్తున్న పక్షులనే అనుమానం వస్తోంది.

చైనీస్ బ్యాడ్జ్‌తో ఉన్న పావురాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. చైనా భారత్ పై ఎన్నో కుట్రలు పన్నుతూ ఉండగా.. ఇప్పుడు భారతదేశంలో గూఢచర్యం కోసం ఈ పావురాన్ని వాడుతూ ఉండవచ్చునని చాలా మంది అనుమానిస్తున్నారు. ఆదివారం సాయంత్రం పోలీసులకు ఈ పావురం గురించి సమాచారం అందించారు. రూర్కెలా నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్స్‌బహల్ స్థానికులకు పావురం దొరికింది. సర్వేశ్వర్ ఛోత్రాయ్ నివాసంలో ఈ పావురం కనిపించింది. ఛోత్రాయ్ మాట్లాడుతూ.. చైనా భాషలో బ్యాడ్జ్ ఉన్న పావురం స్థానిక పావురాల కంటే భిన్నంగా ఉంది. ఆదివారం ఉదయం ఆహారం కోసం ఛోత్రాయ్ తోటలో దిగింది. కొన్ని గంటల తర్వాత, ఛోత్రాయ్ పక్షి ఇంకా అక్కడే ఉండడాన్ని చూశాడు. దాని ఒక కాలుపై ఉన్న బ్యాడ్జ్ అతని దృష్టిని ఆకర్షించింది. బ్యాడ్జ్‌పై సీరియల్ నంబర్‌తో పాటు చైనీస్ పదాలు చెక్కబడి ఉన్నాయి, తదుపరి ధృవీకరణ కోసం పోలీసులకు సమాచారం అందించాడు. అది కన్స్‌బహల్‌కు చేరుకున్న పెంపుడు పావురంలా కనిపించిందని పోలీసులు తెలిపారు. బ్యాడ్జ్‌పై కొన్ని చైనీస్ అక్షరాలు ఉన్నాయని.. అయితే ఎలక్ట్రానిక్ పరికరం లేదా చిప్ కనిపించలేదని అన్నారు. “వివిధ దేశాల ప్రజలు గుర్తింపు కోసం పెంపుడు జంతువులు, పక్షులపై బ్యాడ్జ్‌లు లేదా లేబుల్‌లను ఉంచుతారు. స్థానిక మార్కెట్ నుండి సేకరించిన చైనీస్ బ్యాడ్జ్‌ను ఉపయోగించిన పక్షి యజమాని భారతీయుడు కూడా కావచ్చు, ”అని పోలీసులు తెలిపారు. అయితే చైనా గూఢచర్యాన్ని కూడా కొట్టి పారేయలేమనే అనుమానాలు కూడా ఉన్నాయి.