More

    విశాఖలో ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్

    విశాఖలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి 13 ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ అందర్ని ఆకట్టుకుంటోంది. మూడు రోజులు పాటు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనకు సుబ్బలక్ష్మి కల్యాణ మండపం వేదికైంది.

    అపార విజ్ఞానాన్ని అందించే స్టాంపుల ప్రదర్శనకు మరోసారి విశాఖ వేదికైంది. నాటి భారత జాతీయజెండా రూపకర్త, భారత జాతీయ ప్రతిజ్ఞ, భారత రైల్వే, భారతీయ కళలకు చెందిన ఆరుదైన స్టాంపులు ప్రదర్శనలో కొలువుతీరాయి. రాష్ట్రంలో 109 స్టాంపుల సేకరణ కర్తలు సేకరించిన స్టాంప్‎లను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. వీరితో పాటు ఫిలాటలీ క్లబ్‎ల ప్రతినిధులు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. 337 ఫ్రేమ్స్‎లో ఈ స్టాంప్‎లను ప్రదర్శించారు. కాగా ఈ ప్రదర్శనలో పాల్గొన్న స్టాంప్ సేకరణ కర్తలకు పోటీలను నిర్వహిస్తున్నారు. సేకరించిన స్టాంప్‎లకు ప్రదర్శనతో పాటు వాటికి రేటింగ్ ఇచ్చి, అవార్డులను అందిస్తోంది పోస్టల్ శాఖ. దీంతో పాటు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రదర్శనలో కొన్ని స్పెషల్ కవర్లను కూడా పోస్టల్ శాఖ ఆవిష్కరిస్తోంది. ఈ ప్రదర్శనను నగరంలోని వివిధ విద్యా సంస్థల నుండి విద్యార్థులు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దేశం భక్తి పెంపొందించే ఈ స్టాంప్ ల ప్రదర్శన రాష్ట్రంలో 8 ఏళ్ళ తర్వాత నిర్వహించడంతో ప్రత్యేకత సంతరించుకుంది.

    Trending Stories

    Related Stories