నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుప‌త్రిలో పీజీ విద్యార్థిని శ్వేత అనుమానాస్పద మృతి

0
858

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుప‌త్రిలో పీజీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన శ్వేత అనే అమ్మాయి గైనకాలజీ పీజీ ద్వితీయ సంవ‌త్స‌రం చదువుతోంది. గ‌త‌ రాత్రి ఆసుప‌త్రిలో ప‌ని చేసి, తెల్ల‌వారు జామున 3 గంటలకు విశ్రాంతి గ‌దిలో పడుకుంది. ఉదయం తోటి సిబ్బంది ఆమె కోసం చూస్తే క‌న‌ప‌డ‌లేదు. చివ‌ర‌కు వాష్‌రూమ్ లో ఆమె విగత జీవిగా క‌న‌ప‌డ‌డంతో పోలీసులకు స‌మాచారం అందించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.

శ్వేత మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్ శ్వేత కరీంనగర్ జిల్లాకు చెందిన అమ్మాయి. ఆమె తన ట్రైనింగ్ లో భాగంగా గత రాత్రి రెండు గంటల వరకూ డ్యూటీలోనే ఉన్నారు. ఉదయానికి ఆలయం విగతజీవిగా పడి ఉంది. శ్వేత గుండెపోటుతో మరణించి ఉండొచ్చునని వైద్యులు అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.