More

    తెలంగాణలో పీఎఫ్ఐ అలజడి.. అప్రమత్తమైన ఇంటెలిజెన్స్

    పీఎఫ్ఐ కార్యకర్తల దాడులపై తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అప్రమత్తమైంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పీఎఫ్ఐ కుట్రలు పన్నగా.. అక్కడి పోలీసులు దాన్ని భగ్నం చేశారు. తెలంగాణలో కూడా పీఎఫ్ఐ దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు పీఎఫ్ఐ అనుసంబంధ సంస్థలపై నిఘా పెట్టాలని రాష్ట్ర పోలీసులకు ఇంటెలిజెన్స్ అధికారులు సూచించారు. కేరళ, తమిళనాడులలో ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ కార్యకర్తలపై దాడులు చేసేందుకు పీఎఫ్‌ఐ కుట్ర పన్నినట్టుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. పీఎఫ్‌ఐ, అనుబంధ సంస్థలపై నిఘా ఉంచాలని హెచ్చరించింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఆర్‌ఎస్‌ఎస్, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులను పోలీసులు అలర్ట్ చేశారు.

    శాంతిభద్రతలకు విఘాతం జరగకుండా ఉండేలా పోలీస్ అధికారులు నిఘా పెట్టాలని.. ఇంటెలిజెన్స్ ఆదేశాలు ఇచ్చింది. గత నెలలో (సెప్టెంబర్) ఎన్ఐఏ అధికారులు దేశ వ్యాప్తంగా పలు చోట్ల దాడులు నిర్వహించి.. పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ క్రమంలో హైదారాబాద్ పాతబస్తీలో ఉన్న పీఎఫ్ఐ కార్యాలయాన్ని అధికారలు సీజ్ చేశారు.

    Trending Stories

    Related Stories