PFIతో కేరళ పోలీస్ అనుబంధం..! ఒకరిద్దరు కాదు.. 873 మంది..!!

0
1069

కేరళకు చెందిన 873 మంది రక్షక భటులు భక్షక బటులుగా మారారు. తప్పుపనుల్లోనే తలమునకలై వుండే.. నిషేధిత ఛీత్కార సంస్థ పంచన చేరారు. ఈ క్రిమినల్ మైండ్ పోలీసులు ఆ నేరపూరిత సంస్థ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. నిషేధిత సంస్థ PFI నిర్వాకాలపై సభ్య సమాజం ముక్కున వేలేసుకున్నా, కేరళకు చెందిన ఖాకీలకు సిగ్గు, శరం లేకుండా పోయింది.. తాన తందానా అంటూ ఆ సంస్థ అడుగుల్లో అడుగులు వేస్తున్నారు.

యాన్టీ సోషల్ ఏక్టివిటీస్ తో అన్ పాప్యులరై అబాసుపాలైన సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. కర్ణాటక ఫోరమ్ ఫర్ డిగ్నిటీ, నేషనల్ డెవలప్‌మెంట్ ఫ్రంట్ వికృత సంస్థల అక్రమ సంతానంగా.. ఈ దిక్కుమాలిన PFI పుట్టింది. హిందూత్వ గ్రూపుల మంచితనంపై అసుర ప్రవృత్తి ప్రదర్శించడానికే ఈ సంస్థ ఏర్పాటు చేసినట్టు ముష్కరమూకలు సిగ్గులేకుండా వెల్లడిస్తున్నాయి. ఈ సంస్థ అక్రమార్క పర్వాలకు, నిర్వాకాలకు కేంద్రం చెక్ పెట్టింది. భారత హోం మంత్రిత్వ శాఖ దీనిపై కొరడా ఝళిపించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద 28 సెప్టెంబర్ 2022న ఐదు సంవత్సరాల పాటు నిషేధం విధించింది.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాక్షసత్వానికి దారితీసిన చీకటి రహస్యాలను భద్రతా సంస్థలు ఛేదిస్తున్నాయి. భయంకరమైన ఇస్లామిస్ట్ సంస్థ PFIని నిషేధించిన తర్వాత, PFI అవశేష ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించడానికి సేఫ్టీ ఆర్గనైజేషన్లు తదుపరి చర్యలు తీసుకుంటున్నాయి. PFI, కేరళ పోలీసుల మధ్య నేర సంబంధాన్ని NIA బట్టబయలు చేసింది. NIA ప్రకారం, కేరళ పోలీసుల్లో కనీసం 873 మంది అధికారులు నిషేధిత ‘ఉగ్రవాద సంస్థ’ PFIతో సంబంధాలు కలిగి ఉన్నారు. రాష్ట్ర పోలీసు చీఫ్‌కు నివేదిక అందజేస్తూ ఎన్‌ఐఏ ఈ ఆరోపణలు చేసింది.

ఇంకా, రాష్ట్ర పోలీసు దళానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు ఇప్పటికీ కేంద్ర ఏజెన్సీల పరిశీలనలో ఉన్నందున కళంకిత పోలీసుల జాబితా పెరగవచ్చు. వీరిలో సబ్-ఇన్‌స్పెక్టర్, స్టేషన్ హెడ్ ఆఫీసర్ ర్యాంక్‌ల్లోని అధికారులు, సివిల్ పోలీసు సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం ఎన్ఐఏ ఈ అనుమానిత అధికారుల ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరిస్తోంది.

NIA ఇచ్చిన జాబితా ప్రకారం.. పై నుంచి క్రింది వరకు పోలీసు అధికారులందరూ వున్నట్టు తెలుస్తోంది. కీలకమైన సమాచారాన్ని పీఎఫ్‌ఐకి లీక్ చేశారన్నది పోలీసు అధికారులపై ప్రాథమిక అభియోగం. లీక్‌లో రాష్ట్ర పోలీసుల కదలికలకు సంబంధించిన సమాచారం, ముఖ్యంగా దాడులకు సంబంధించిన సమాచారం ఉంది.

గతేడాది ఫిబ్రవరిలో తొడుపుజాలోని కరిమన్నూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సివిల్ పోలీసు అధికారిని సర్వీసు నుంచి తొలగించారు. ఆ అధికారి కొందరి ప్రముఖుల వివరాలను పీఎఫ్‌ఐకి లీక్ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై మున్నార్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఎస్ఐతో సహా ముగ్గురు పోలీసు సిబ్బందిని బదిలీ చేశారు.

నిషేధిత సంస్థ PFI కేరళ నుంచి 22 రాష్ట్రాలకు తన వికారమైన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. PFI తొలి ఉగ్రవాద చర్య సైతం కేరళలోనే జరిగింది. కేరళ ప్రొఫెసర్ జోసెఫ్ చేతిని నరికివేసింది. నిషేధిత సంస్థ PFI లేదా మరేదైనా తీవ్రవాద గ్రూపుతో నేతలు, అధికారులతో సహా ఎవరికి సంబంధం వున్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

4 × two =