దీపావళి పర్వదినాన పెట్రో బాంబులతో భీభత్సం..! వడోదరలో మతోన్మాదుల రాళ్ళదాడులు..!!

0
728

భారత్ లో హిందువులు తమ పండుగలను చేసుకోవాలంటేనే భయపడే రోజులు వస్తున్నాయి. అన్య మత ఉన్మాదులు హిందూ పండుగలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. ఈసారి కూడా దీపావళి రోజున దేశంలో పలు చోట్ల రాళ్ళ దాడులకు పాల్పడ్డారు. సెక్యులర్ కంట్రీ అని చెప్పుకునే భారత్ లో ఒక వర్గం మాత్రం మెజారిటీ వర్గంపై దాడులు చేస్తూనే ఉంది. హిందువులకు పెద్ద పండుగలు ఎప్పుడొచ్చినా దేశంలో ఎక్కడో ఒకచోట ఈ విధమైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. గతంలో శ్రీరామ నవమి ఇప్పుడు దీపావళి. పండుగ ఏదైనా రాళ్ళదాడులు మాత్రం ఆగటం లేదు. తాజాగా ఇటువంటి సంఘటన గుజరాత్ లో జరిగింది.

హిందువులు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. రావణాసుర వధ తర్వాత 14 ఏళ్ళ వనవాసం ముగించుకుని రాముడు అయోధ్యకు తిరిగొస్తాడు. ఆ శుభసందర్భాన్ని పురస్కరించుకుని ప్రజలంతా దీపావళిని జరుపుకుంటారు. ఇళ్ళన్నిటినీ దీపావళి వెలుగులతో అలంకరించి ముస్తాబు చేస్తారు. పిండివంటలతో ఇంటిల్లిపాది ఆనందంగా గడుపుతారు. ఇక పిల్లలైతే, ఎప్పడెప్పుడు పూజ పూర్తవుతుందా టపాసులు ఎప్పుడెప్పుడు కాలుద్దామా అని ఉత్సుకతతో ఎదురుచూస్తుంటారు. అయితే ఈ విధంగా టపాసులు కాల్చడం కొంతమంది ఉన్మాదులకు నచ్చలేనట్టుంది. దీంతో ఎంతో ఆనందంగా జరుపుకోవాల్సిన దీపావళి పండుగను రాళ్ళదాడులతో బీభత్సం చేసి అల్లర్లను ప్రేరేపించారు. ఒక్కసారిగా రాళ్ళు, పెట్రోల్ బాంబులకతో విరుచుకుపడ్డారు. ఈ అల్లర్లు మొదటగా వడోదరలోని ముస్లిం మెడికల్ సెంటర్ దగ్గర మొదలయ్యాయి. ఒక్కసారిగా అల్లరి మూకలు పెట్రోల్ బాంబులతో, రాళ్ళ దాడులతో రోడ్లపైకి వచ్చారు. హిందువులకు చెందిన ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్మాదాన్ని ప్రదర్శించారు. దీంతో హిందూ, ముస్లింల మధ్య పెద్దయెత్తున గొడవలు జరిగాయి. ఈ అల్లర్లతో అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఏకంగా పోలీసులనే టార్గెట్ చేసుకుని రాళ్ళదాడులు జరపడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న ఎన్నో వాహనాలను ధ్వంసం చేశారు. ఇందులో కొన్ని వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఓ వీడియోలో పోలీసులు వస్తుండగా వారిపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. అయితే ఈ దాడి నుంచి పోలీస్ అధికారి తృటిలో తప్పించుకున్నారు. ఇక అల్లరిమూకను కట్టడి చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు.

పరిస్థితి అదుపులోకి తెచ్చిన పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తిస్తున్నారు. ఇప్పటికే అల్లర్లలో పాలుపంచుకున్న 19 మంది ఉన్మాదులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. సీసీటీవీతో పాటు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని సేకరించి మరింత మందిని గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే వడోదరలో జరిగిన ఈ అల్లర్లు ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పటికప్పుడు అల్లర్లు చెలరేగితే పెట్రోల్ బాంబులు వచ్చేవి కావు. వీటిని తయారుచేయాలంటే ముందుగానే పెట్రోల్, సీసాలను సేకరించి వాటిని తయారు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, వీటిని బాహ్య ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా తయారు చేయాలి. కాబట్టి ఈ అల్లర్లను ఎవరో కావాలనే ముందుగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గుజరాత్ పోలీసులు సరైన దర్యాప్తు జరిపి వీరి వెనకున్నది ఎవరో తేల్చాలని పలువురు కోరుతున్నారు.

అయితే ఈ విధంగా హిందూ పండుగలపై రాళ్ళ దాడులు జరగటం ఇదే మొదటిసారి కాదు. గతంలో శ్రీరామనవమి రోజున కూడా దేశవ్యాప్తంగా ఇటువంటి దాడులు జరిగాయి. దేశవ్యాప్తంగా మతోన్మాదులు శ్రీరామనవమి శోభాయాత్రలపై దాడులు చేస్తూ భీభత్సం సృష్టించారు. ఈ రాళ్ళదాడుల్లో ఎంతో మంది అమాయకులు గాయపడ్డారు. అయితే దేశంలో నానాటికీ ఇటువంటి ఉన్మాదం అక్కడక్కడా బయటపడుతూనే ఉంది. దీనిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

twenty − 5 =