More

  హిందూ ద్వేషికి నీరాజనమా..?

  జాతి నిర్మాణం కోసం పాటుపడిన మహనీయులకు నివాళులు అర్పించడంలో అర్థముంది. దేశం కోసం పాటుపడిన వీరుల త్యాగాన్ని గుర్తుచేసుకోవడం స్ఫూర్తిదాయకం. కానీ, తన జీవితకాలాన్ని సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం వెచ్చించిన ఓ వ్యక్తికి.. నీరాజనాలు అర్పించడం కరెక్టేనా..? విదేశీ మిషనరీలతో జతకట్టి, హిందూ సమాజాన్ని నాశనం చేయాలనుకున్న ఆ హిందూ ద్వేషి ఉనికిని గుర్తుచేసుకోవడం సబబేనా..? కానీ, తమిళనాడులో అదే జరగబోతోంది. స్టాలిన్ ప్రభుత్వం ఓ హిందూ వ్యతిరేకిని కీర్తించేందుకు సిద్ధమైంది. ఆయన జయంతిని ‘సోషల్ జస్టిస్ డే’ జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

  ద్రవిడార్ కజగం వ్యవస్థాపకుడు, నేటి డీఎంకే పార్టీ ఆవిర్భావానికి కారకుడైన హిందూ వ్యతిరేకి.. ఈవీ రామస్వామి జయంతిని ‘సోషల్ జస్టిస్ డే’గా జరిపేందుకు స్టాలిన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ‘ప్రగతిశీల’ ఉద్యమం ముసుగులో ఎందరో బ్రాహ్మణులను చంపాలని రెచ్చగొట్టాడు పెరియార్. అలాంటి వ్యక్తి ఇప్పటికి తమిళనాట గౌరవించబడుతూనేవున్నాడు. మార్క్సిస్టులు, ఉదారవాద చరిత్రకారుల దృష్టిలో, హిందూ వ్యతిరేకి అయిన పెరియార్ ఒక సామాజిక వేత్త. బ్రాహ్మణత్వం, కుల ప్రాబల్యం, మహిళా అణచివేత వంటి దురాచారాల నుంచి దేశాన్ని రక్షించిన యోధుడు.

  ఈ ఆలోచనలు పైకి చెప్పుకోవడానికి గొప్పగా కనిపిస్తున్నప్పటికీ.. ఇందులో వాస్తవికత మాత్రం దాదాపు శూన్యం. నిజానికి, కులవ్యవస్థ నిర్మూలన పేరుతో బ్రాహ్మణ సమాజాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేశాడు పెరియార్. ఇంకా సరళంగా చెప్పాలంటే, పెరియార్ అనేవాడు.. హిందువుల పతనమే లక్ష్యంగా పెట్టుకున్న జాత్యాహంకారి మాత్రమే. బ్రాహ్మణులు అసలు నిజాయితీపరులే కాదని వాదించిన కరుడుగట్టిన బ్రాహ్మణ వ్యతిరేకి. కేవలం బ్రాహ్మణుల నిర్మూలనకు, తద్వారా హిందూ సమాజ విచ్ఛిన్నం కోసమే పెరియార్ తన జాత్యాంహకార ఉద్యమాన్ని నడిపించాడంటే అతిశయోక్తి కాదు.

  దేశంలో హిందూ సమాజ విచ్ఛిన్నం కోసం ద్రవిడ ఉద్యమాన్ని నడిపిన పెరియార్.. ఒక సందర్భంలో నెహ్రూ, గాంధీ చిత్రపటాలతో పాటు.. భారత రాజ్యాంగాన్ని కూడా తగులబెట్టాలని పిలుపునిచ్చాడు. అవసరమైతే బ్రాహ్మణులను కొట్టిచంపాలని.. వారి ఇళ్లను తగలబెట్టాలని చెప్పిన చరిత్ర పెరియార్ సొంతం. 1953లో వినాయక విగ్రహాలను ధ్వంసం చేయడం కోసం పెరియార్ పెద్దయెత్తున ఆందోళనలు నిర్వహించాడు. దేవుళ్లు బ్రాహ్మణుల పక్షపాతం వహిస్తారని.. వారి విగ్రహాలను ధ్వంసం చేయాల్సిందేనని వితండవాడం చేశాడు. ఏదైనా మంచి పని చేపట్టే ముందు హిందువులు వినాయకుడిని పూజిస్తారు.. కాబట్టి, తాను మొదట వినాయక విగ్రహాలను కూల్చేస్తానని శపథం చేశాడు.

  అంతేకాదు, రామయాణం గురించి అనేక వ్యాఖ్యలు చేశాడు పెరియార్. మర్యాదా పురుషోత్తముడైన రాముడిని అనేక రకాలుగా దుర్భాషలాడాడు. రాముడు మహిళలను చంపి, ముక్కలు చేశాడని అబద్ధాలు ప్రచారం చేశాడు. ద్రవిడుల గుర్తింపును చెరిపేసేందుకే, ఆర్యులు రామాయణ, మహాభారతాలను రచించారని దూషించాడు. బ్రహ్మణ వ్యతిరేక వాదమే కాదు.. స్త్రీ వ్యతిరేక వాదాన్ని కూడా ప్రదర్శించాడు పెరియార్. ద్రవిడార్ కజుగమ్ అధికారిక పత్రికలో.. అనేకసార్లు స్త్రీవాదానికి వ్యతిరేకంగా వ్యాసాలు రాశాడు. బ్రాహ్మణ స్త్రీలు ద్రవిడ యువతకు ఆకర్షితులయ్యారని కారుకూతలు కూశాడు. బ్రిటీషువాళ్లు మరో పదేళ్లు కొనసాగి వుంటే.. సగం కంటే ఎక్కువమంది బ్రాహ్మణ మహిళలు ద్రవిడులైపోయేవారని.. బ్రాహ్మణకులం సగానికి పైగా నాశనమయ్యేదని దుర్భాషలాడాడు.

  కేవలం ఒక సమాజం, ఒక మతంపై ద్వేషించడం కోసమే పెరియార్ నాడు ద్రవిడ ఉద్యమాన్ని నడిపాడు. మొదట్లో దేశాన్ని ముక్కలు చేయాలని భావించాడు. దక్షిణాది రాష్ట్రాలతో ద్రవిడ దేశాన్ని స్థాపించాలని తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే, అతని దుర్మార్గం సాకారం కాలేదు. కానీ, హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పెరియార్ వాదులు ఇప్పటికీ ప్రయత్నిస్తూనేవున్నారు. మతోన్మాదులుగా మారి హిందూ వ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేస్తూనేవున్నారు. పెరియార్ ప్రేరేపిత ద్రవిడ ఉద్యమం కారణంగానే.. నేడు తమిళనాడు వ్యాప్తంగా క్రిస్టియన్ మిషనరీలు, ఇస్లాం మత సంస్థలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. ద్రవిడ భావజాల మూలాలు చర్చి నుంచి మొదలయ్యాయన్నది చారిత్రక వాస్తవం. పెరియార్‎ సన్నిహిత సమన్వయంతో హిందూ మతాన్ని క్రమపద్ధతిలో నాశనం చేయడానికి.. నాడు చర్చి పాలకులు డిజైన్ చేసిన ఉద్యమమే ద్రవిడ ఉద్యమం.

  ప్రపంచవ్యాప్తంగా రాజ్యపాలనలో క్రైస్తవాన్ని జొప్పించాలనుకున్న చర్చి ప్రయత్నం ఎక్కడా సాకారం కాలేదు. ఈ ఫెయిల్యూర్ థియరీని భారత్ పైనా ప్రయోగించారు. ఈ క్రమంలో 300 ఏళ్ల బ్రిటిష్ పాలనలో భారత్ ను విచ్ఛిన్నం చేసేందుకు పెరియార్ వంటి జాతివ్యతిరేక శక్తులను ప్రోత్సహించింది. బ్రిటిష్ పాలకుల ఆలోచనలకు అనుగుణంగా ద్రవిడ ఉద్యమాన్ని నడిపిన పెరియార్.. కేవలం హిందూ సమాజ విధ్వంసమే లక్ష్యంగా.. క్రైస్తవంతో ఇస్లామ్‎ను కూడా వెనకేసుకువచ్చాడు. మొదట్లో బురఖా సంప్రదాయాన్ని వ్యతిరేకించిన పెరియార్.. ముస్లిం సమాజం నుంచి వ్యతిరేకత ఎదురుకావడంతో తరువాతికాలంలో తన తీరు మార్చుకున్నాడు.

  ద్రవిడులు వల్లించే ఆర్యన్ దండయాత్ర సిద్ధాంతానికి చరిత్రలో ఎలాంటి ఆధారం లేదనేది వాస్తవం. ఇదో ఫెయిల్యూర్ థియరీ అని మనందరికీ తెలుసు. పెరియార్ వంటి వ్యక్తులచే.. భారతదేశాన్ని ముక్కలు చేసేందుకు పశ్చిమ దేశాలు పన్నిన కుట్ర సిద్ధాంతమే ఆర్యన్ దండయాత్ర. ఈ కుట్ర సిద్ధాంతం ఆధారంగా.. పెరియార్ పాదుకొల్పిన ద్రవిడవాద విషసంస్కృతి తమిళనాట ఇప్పటికీ కొనసాగుతూనేవుంది. పెరియార్ భావజాలం నుంచి పుట్టిన డీఎంకే లాంటి పార్టీలే కొన్ని దశాబ్దాలుగా తమిళనాడును పాలిస్తున్నాయి. ద్రవిడ భావజాలం ముసుగులో.. హిందూ వ్యతిరేక, బ్రాహ్మణ వ్యతిరేక మతోన్మాదంతో అపఖ్యాతి పాలవుతున్నాయి. రాముడు తాగుబోతు అన్న దివంగత కరుణానిధి మాటలు.. హిందూ వ్యతిరేక వైఖరికి, ద్రవిడవాదానికి పరకాష్ట. ‘హిందువు’ అనే మాటకు ‘దొంగ’ అన్న పెరియార్ మాటలను సమర్థించి.. తనలో నరనరానా జీర్ణించుకుపోయిన హిందూ వ్యతిరేక భావజాలాన్ని చాటుకున్నాడు కరుణానిధి.

  అయితే, తమిళనాడులా.. ఇతర దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళలో ఎక్కడా ఈ ద్రవిడవాదం చెల్లుబాటు కాలేదు. ఆంధ్రులు, కన్నడిగులు ఎప్పుడూ ద్రవిడ గుర్తింపును కోరుకోలేదు. మలయాళీలు సైతం ద్రవిడవాదానికి వ్యతిరేకం. ప్రహ్లాదుని మనవడు బలిచక్రవర్తి వారసులుగా చెప్పుకోవడానికే ఇష్టపడతారు. వారి వారసత్వానికి గుర్తుగా ఓనమ్ పండుగను అంగరంగవైభవంగా జరుపుకుంటారు. తమిళనాడులో మాత్రమే ద్రవిడ సంస్కృతి సాలెగూడులా విస్తరించింది. హిందూ సమాజ ఉనికిని ద్రవిడవాదం ఏమాత్రం భరించలేదు. ద్రవిడ తత్వమైన జాత్యాహంకార విభజనకు.. దేవాయాలు ప్రధాన అడ్డంకి.

  అందుకే.., ద్రవిడవాదం నుంచి పుట్టిన డీఎంకే పార్టీ అధినేత, సీఎం స్టాలిన్ హిందూ దేవాలయాలను చిన్నచూపు చూస్తున్నాడు. కాబట్టే, తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ హిందూ దేవాలయాలు ధ్వంసమవుతున్నాయి. క్రైస్తవ మిషనరీల సూచనల మేరకే.. ఈ విధ్వంసం జరుగుతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి విధ్వంస సంస్కృతికి, సమాజ విచ్ఛిన్నానికి ఆద్యుడైన హిందూ వ్యతిరేకి పెరియార్.. ప్రశంసలకు ఏమాత్రం అర్హుడు కాడు. అయితే, పెరియార్ భావజాలం నుంచి పుట్టిన డీఎంకే.. ఆయన్ను నెత్తినపెట్టుకోవడంలో ఆశ్చర్యం ఏముంటుంది..? అందుకే, స్టాలిన్ ప్రభుత్వం పెరియార్ జయంతిని ‘సోషల్ జస్టిస్ డే’గా జరిపేందుకు సిద్ధమవుతోంది.

  Trending Stories

  Related Stories