పెన్షన్ ను పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

0
880

ఆంధ్రప్రదేశ్ లో నెలనెలా ఇస్తున్న వృద్ధాప్య పింఛన్ ను పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న రూ. 2,225 పింఛన్ ను రూ. 2,500కు పెంచుతున్నట్టు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందని చెప్పారు. జిల్లా కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నెల 21న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించనున్నట్టు చెప్పారు.

ఇప్పటివరకూ పేదలకు రూ.2250 చొప్పున ఈ పింఛన్లు ఇస్తుండగా, వచ్చే ఏడాది నుంచి రూ.2500 చొప్పున ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.దీంతో రూ.250 చొప్పున పింఛన్ పెరగబోతోంది. సామాజిక పింఛన్ల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ ప్రభుత్వం. గతంలో వైఎస్ జగన్ టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.2 వేలకు పెంచిన పింఛన్ ను తాము అధికారంలోకి వస్తే రూ.3 వేలకు పెంచుకుంటూ పోతామని హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏడాదికి రూ.250 చొప్పున నాలుగేళ్లలో మీ పింఛన్ రూ.3 వేలకు చేరుతుందని క్లారిటీ ఇచ్చారు.

వచ్చే ఏడాది జనవరి 9న ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈబీసీ నేస్తం పథకం వల్ల అగ్రవర్ణ నిరుపేద మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. 45 నుంచి 60 ఏళ్ల వయసున్న నిరుపేద మహిళలకు మూడేళ్లలో రూ. 45 వేల చొప్పున ఆర్థికసాయం చేయనున్నారు. జనవరిలో రైతు భరోసా సాయాన్ని కూడా అందజేస్తామని చెప్పారు. అయితే రైతు భరోసా ఇచ్చే తేదీని త్వరలో ప్రకటించనున్నారు. అమ్మఒడి స్థానంలో ఈబీసీ నేస్తం పథకాన్న ప్రారంభించనున్నారు. 45-60 ఏళ్ల మధ్య వయసున్న అగ్రవర్ణ పేద మహిళలకు రూ.15వేల చొప్పున జమ చేయనున్నారు. వారికి మూడేళ్లలో రూ.45వేలు ఇవ్వనున్నారు. రైతు భరోసా పథకాన్ని కూడా జనవరిలోనే ఇవ్వనున్నట్లు జగన్ తెలిపారు.