More

    జమ్మూ కాశ్మీర్: అక్కడ జాతీయ జెండాలను తీసి వేయించారు

    మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పిడిపి జమ్మూ కాశ్మీర్‌లోని రాజోరి జిల్లాలోని కోట్రాంకా ప్రాంతంలోని ప్రభుత్వ భవనంపై ఉన్న జాతీయ జెండా తీసి వేశారు. ఆమె పార్టీ కార్యకర్తలు జాతీయ జెండాను తీసివేసి పిడిపి జెండాలను ఉంచి భారత జాతీయ జెండాను మరోసారి అవమానించారు. ఆమె పార్టీ కార్యకర్తలు చేసిన ఈ పనిపై వ్యాఖ్యానించడానికి లేదా ఖండించడానికి మెహబూబా ముఫ్తీ ముందుకు రాలేదు. ఈ ఘటనపై జమ్మూ & కాశ్మీర్ పోలీసులు ప్రెస్ నోట్‌లో కంది పోలీస్ స్టేషన్‌లో జాతీయ గౌరవ చట్టం 1971 సెక్షన్ 2 (A) సెక్షన్ 2 (A) కింద FIR (136/2021) నమోదు చేసినట్లు సమాచారం. శనివారం నైబ్ తహసీల్దార్ ద్వారా కంది పోలీస్ స్టేషన్‌కు ఒక దరఖాస్తు పంపినట్లు పోలీసులు తెలిపారు. నైబ్ తహసీల్దార్ సెప్టెంబర్ 17-18 మధ్య రాత్రి కోట్రాంకాలోని డాక్ బంగ్లా భవనం పైన గుర్తు తెలియని వ్యక్తులు జాతీయ జెండాను తీసివేసినట్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను ఉంచినట్లు తెలిపారు.

    ఈ సంఘటన గురించి తెలుసుకున్న రాజౌరి జిల్లా డిప్యూటీ కమిషనర్ రాజేష్ కుమార్ సావమ్ సూచన మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఆయన సూచనల తరువాత పోలీసులు త్రివర్ణ పతాకాన్ని డాక్ బంగ్లాపై పునరుద్ధరించారు. జాతీయ జెండాను పునరుద్ధరించిన తర్వాత అధికారులు జాతీయ గీతాన్ని పాడుతున్న వీడియోను కూడా చూడొచ్చు. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పీర్ పంజల్ పరిధిలో పర్యటించినప్పుడు డాక్ బంగ్లాను ఆమె బస చేయడానికి సిద్ధంగా ఉంచారు. కొంతమంది పిడిపి కార్యకర్తలు ప్రభుత్వ భవనం నుండి జాతీయ జెండాను తీసివేసి, దాని స్థానంలో తమ పార్టీ జెండాను ఉంచారు. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదంపై మెతకగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న మెహబూబా ముఫ్తీ ఈ ఘటనపై స్పందించమని కోరగా నీళ్లు నమిలారు ఈ సంఘటనను ఖండించడానికి నిరాకరించారు. ఈ విషయం తనకు తెలియదని, అది ఎవరు చేశారో వారిని అడగాలని ఆమె అన్నారు.

    Trending Stories

    Related Stories