More

    జనసేన నాయకుల అరెస్ట్.. ప్రత్యక్ష్యంగా ఉద్యమిస్తామని హెచ్చరించిన జనసేనాని

    విశాఖలో వైసీపీ మంత్రులు, నాయకులపై జరిగిన రాళ్ల దాడికి సంబంధించిన కేసులో పోలీసులు గత అర్ధరాత్రి జనసేన నాయకులను అరెస్ట్ చేశారు. విమానాశ్రయం వద్ద జరిగిన దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని సేకరించిన పోలీసులు దాని ఆధారంగా నిందితులను గుర్తించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోన తాతారావు, పీతల మూర్తియాదవ్, విశ్వక్‌సేన్, సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల సందీప్, శివప్రసాద్‌రెడ్డి, పీవీఎస్ఎన్ రాజు, శ్రీనివాస్ పట్నాయక్, కీర్తీస్, యశస్విని, గేదెల చైతన్య, పట్టిమ రాజులను అరెస్ట్ చేశారు.

    అక్రమంగా అరెస్టు చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. తమ నాయకులను విడుదల చేయకపోతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. తమ పార్టీ నాయకులను విడుదల చేసే వరకు జనవాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ర్యాలీలు చేయడాన్ని ఈ ప్రభుత్వం తప్పుగా పరిగణిస్తుందన్నారు. ప్రజాస్వామ్య పరక్షణను జనసేన పార్టీ కోరుకుంటుందని తెలిపారు. తమ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టడంపై ప్రత్యక్ష్యంగా ఉద్యమిస్తామని, ప్రభుత్వం ఈ విషయమై పునరాలోచించుకోవాలన్నారు. తమ పార్టీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని, తామ పార్టీ కార్యకర్తలు అంత పెద్ద తప్పు ఏమి చేశారన్నారు. పోలీసులు తమను రెచ్చగొడుతున్నారని, వారు ఆ పద్ధతి మానుకోవాలన్నారు.

    Trending Stories

    Related Stories