More

    పవన్ కళ్యాణ్ అలా అంటుంటే.. ఫిలింఛాంబర్ ఇలా అంటోంది..!

    జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో కొన్ని మీడియా సంస్థలపైనా, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం పైనా తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే..! తెలుగు చిత్ర పరిశ్రమను వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని పవన్ కళ్యాణ్ అన్నారు. రాను రాను రాజ‌కీయాల్లో దిగ‌జారుడుత‌నం పెరిగింద‌ని విమర్శించారు. ప్ర‌తీసారి సినిమా ప‌రిశ్ర‌మ సులభంగా టార్గెట్ అవుతుంద‌న్నారు. మీడియా క‌థ‌నాల‌ను హీరోల ప్ర‌మాదాల‌పై కాకుండా.. వైఎస్ వివేకానంద ఎలా హత్యకు గురయ్యారు అనే దాని మీద రాయాలని అన్నారు. కోడి కత్తి మీద, ఆరేళ్ల చిన్నారి హత్య మీద మాట్లాడాలి అంటూ కామెంట్‌ చేశారు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వాళ్లు కోట్లు కోట్లుతీసుకుంటారు అని అంటుంటారు. ఓరి స‌న్నాస్సుల్లారా.. అడ్డగోలుగా గా సంపాదించడం లేదు. జనాలను ఎంటర్ టైన్ మెంట్ చేసి. ప్రభాస్ లాగా కండలు పెంచితే , ఎన్టీఆర్ డాన్సులు చేస్తే, డబ్బులు ఇస్తున్నారు. ప్ర‌తీసారి సినిమా వాళ్ల‌ను గెల‌కొద్దు, దేనినైనా తెగేదాక లాగొద్దు. వైసీపీ నాయ‌కులు సినిమా ఇండ‌స్ట్రీని టార్గెట్ చేయకూడదని హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగానే ఏపీ ప్రభుత్వం చిత్రపరిశ్రమను ఇబ్బందులకు గురి చేస్తోందని.. నేను సినిమా తీయడం వల్ల చిత్ర పరిశ్రమను ఇబ్బందులలో పెట్టడం సరికాదని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. పవన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి.

    పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించి ప్రెస్ నోట్ విడుదల చేసింది. తెలుగు సినిమా పరిశ్రమకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మద్దతు ఎంతో అవసరం ఉందని తెలిపింది. చిత్ర పరిశ్రమకు రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్ళు లాంటివని, ప్రభుత్వ మద్దతు ఉన్నప్పుడే చిత్ర పరిశ్రమ మనుగడ కొనసాగుతుందని ఫిలిం ఛాంబర్ పేర్కొందితెలిపింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుందని ఈ విషయంపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. అయితే ఆ వ్యక్తిగత అభిప్రాయాలను వివిధ వేదికలపై తెలియజేస్తున్నారు. వ్యక్తిగతంగా చెప్పే అభిప్రాయాలకు.. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఏ విధమైనటువంటి సంబంధం లేదని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసింది. కరోనా మహమ్మారి కారణంగా తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలు అన్నింటిని ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. అయితే ఈ సమస్యలపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. చిత్రపరిశ్రమకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నాయని,ఎప్పటికీ చిత్రపరిశ్రమను రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విధంగానే ఆదుకోవాలని ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెస్ నోట్ వచ్చింది.

    మరో వైపు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ‘‘ప్రజలు మీద పనులు రుద్ది, మద్యం ఆదాయం తాకట్టుతొ అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు, సంక్షేమం అస్సలే కాదు. నేటి ‘నవ రత్నాలు’ భావితరాలకు ‘నవ కష్టాలు.’’’ అంటూ ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు.. ఇప్పుడు జరుగుతున్న పనులకు సంబంధించి తీవ్ర విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్.

    Trending Stories

    Related Stories