వైసీపీ ప్రభుత్వంపై పవన్ సెటైర్ చూశారా..?

0
946

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు విమర్శలు కురిపిస్తూనే ఉంటారు. తాజాగా సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ పై విమర్శలు కురిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కాదు.. కాదు.. సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తున్నట్లుగా ఏపీలో పరిస్థితి తయారయిందని పవన్ కళ్యాణ్ సెటైర్ వేశారు. ఈమేరకు పవన్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో అక్రమంగా సారా కాస్తున్నారని, మద్యం డిస్టిలరీలన్నీ కూడా వైసీపీ వారివేనని చురకలంటించారు. వీటి ద్వారా వచ్చే అదనపు వేల కట్ల ఆదాయం కూడా వారికేనని, అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు… సత్ప్రవర్తనులు ఆయనకిష్టులు అంటూ బైబిల్ సూక్తిని ట్వీట్ చేశారు.