గన్నవరం చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఉద్రిక్త పరిస్థితులు

0
656

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. ఆ తర్వాత ట్విట్టర్ లో తీవ్ర విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై ఏపీ మంత్రులు తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇక ప‌వ‌న్ కళ్యాణ్ ఏపీలో ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. కాసేపటిక్రితం హైదరాబాదు నుంచి గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ప‌వ‌న్ కు స్వాగ‌తం ప‌లికేందుకు ఎయిర్‌పోర్టు వ‌ద్ద‌కు అభిమానులు భారీగా చేరుకున్నారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవ‌డంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ప‌వ‌న్ కు అనుకూలంగా అభిమానులు నినాదాల‌తో హోరెత్తించారు.

పవన్ మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో పార్టీ విస్తృత‌స్థాయి స‌మావేశంలో పాల్గొన‌నున్నారు. ఏపీలో పార్టీని బ‌లోపేతం చేయ‌డం, వైసీపీ ప్ర‌భుత్వంపై పోరాడ‌డంవంటి అంశాల‌పై త‌మ నేత‌ల‌కు ప‌వ‌న్ దిశా నిర్దేశం చేయ‌నున్నారు. అక్టోబ‌రు 2న ప‌వ‌న్ ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో శ్రమదానం చేయాలని నిర్ణ‌యం తీసుకున్నారు.

పవన్ కళ్యాణ్ పై ప్రెస్ మీట్ పెట్టినందుకు పవన్ ఫ్యాన్స్ నుంచి మెసేజ్‌లు వస్తున్నాయని పోసాని కృష్ణ మురళి రెండో రోజు ప్రెస్ మీట్ నిర్వహించి విరుకుచుకుపడ్డారు. పోసాని మాట్లాడుతూ.. ‘నన్ను బూతులు తిడుతూ వందలాది మెసేజ్‌లు వస్తున్నాయి. జగన్ ను పవన్ అనరాని మాటలు అన్నారు. ఆరోపణలు చాలా మందిపై ఉంటాయి. పవన్ వ్యక్తిగతంగా మాట్లాడారు. గతంలో కేసీఆర్ ను కూడా విమర్శించారు. అప్పుడు పవన్ కు కేసీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చాడని పోసాని తెలిపారు. పవన్ పై పగ పెట్టుకునే ఆలోచన లేదు. నేను జగన్ అభిమానిని.. అందుకే రియాక్ట్ అయ్యాను. నిన్నటి నుంచి ప్రతి సెకండ్ కు ఫోన్లు వస్తున్నాయి. ఫోన్లు వస్తున్నాయి.. బూతులు తిడుతున్నారు. రాజకీయాలకు, ఇంట్లో వాళ్లకు సంబంధం ఏంటి..? చిరంజీవిపై కేశినేని కామెంట్స్ చేసినప్పుడు పవన్ ఎక్కడ ఉన్నాడు. ఎందుకు ఒక్క మాట మాట్లాడలేదు. పవన్ ఒక సైకో.. ఎవరో ఫంక్షన్లు పెట్టుకుంటే అక్కడికి పవన్ ఫ్యాన్స్ ఎందుకు వస్తున్నారని పోసాని మరోసారి పోసాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోసాని కృష్ణ మురళిపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రెస్ మీట్ వద్దకు పవన్ అభిమానులు భారీగా చేరుకుని నిరసన తెలిపారు. కొట్టడానికి కూడా ప్రయత్నించారు. పోసాని కృష్ణ మురళి తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డంతో ప‌వ‌న్ అభిమానులు మండిప‌డుతున్నారు. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పోసానిపై జనసేన నేత‌లు ఫిర్యాదు చేశారు. ఆయ‌న‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు పోసానిపై కేసు నమోదు చేసిన‌ట్లు తెలుస్తోంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here