ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన పవన్ కళ్యాణ్

0
646

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే..! ప్రధాని మోదీని పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు కలిశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రధాని మోదీని కలిశారు. ఏపీలో బీజేపీ-జనసేనకు పొత్తు ఉండడంతో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ ట్విట్టర్‌లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోస్ట్‌లు పెట్టారు. ”క్లిష్ట సమయంలో పాలన చేపట్టి- ప్రాంతీయవాదాలు, సాంస్కృతిక వైరుధ్యాలు.. అన్నింటినీ అర్థం చేసుకొని ఆదరించి ప్రతి ఒక్కరిలో భారతీయులం అనే భావన నింపారని, ప్రజారోగ్యానికి వాటిల్లిన విపత్తు, దేశ భద్రతకు పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షణకు అహరహం తపించారని” అన్నారు. ”ప్రతి కఠిన పరిస్థితినీ ఉక్కు సంకల్పంతో ఎదుర్కొనే నాయకత్వ పటిమగల పురోగమనశీలి నరేంద్ర మోదీ. ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద.. అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ – శేషేంద్ర చెప్పిన ఈ కవితా పంక్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్థానానికి అద్దంపడతాయి” అని పవన్ కళ్యాణ్ వరుసగా పోస్టులు పెట్టారు.