విశాఖలో జనసేన నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేసి, హత్యాయత్నం కేసులు పెట్టారని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖలో ప్రజలకు కనీసం అభివాదం చేసేందుకు కూడా అవకాశం లేకుండా తనపై పోలీసులు ఆంక్షలు విధించారన్నారు. ఇటువంటి ఆంక్షలే భవిష్యత్తులో విధించకుండా, జగన్ ప్రభుత్వాన్ని నియంత్రించేలా న్యాయపోరాటం చేయనున్నట్లు తెలిపారు.