More

    పవన్ కళ్యాణ్ కొత్త కాన్వాయ్ ను చూశారా..?

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీని ప్రజల్లోకి మరింత తీసుకుని వెళ్లాలని భావిస్తూ ఉన్నారు. అక్టోబరు 5న తిరుపతిలో పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కోసం భారీ కాన్వాయ్ ని సిద్ధం చేస్తున్నారు. బ్లాక్ కలర్ మహీంద్రా స్కార్పియో వాహనాలు జనసేన కార్యాలయంలో ఉన్న ఓ వీడియోలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ దసరా నుంచి ఐదు నెలల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు.

    అక్టోబర్ నుంచి ఆయన బస్సు యాత్రను ప్రారంభిస్తారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5 నుంచి పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేపడతారని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ ఎండగడతారని చెప్పుకొచ్చారు. జగన్ పాలనలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని.. మరోసారి జగన్ అధికారంలోకి రాకూడదని ప్రజలు భావిస్తున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు.

    Trending Stories

    Related Stories