More

    అంజన్న సేవలో జనసేనాని.. కోలాహలంగా కొండగట్టు..!

    జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. కొండగట్టు చేరుకున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్.. ముందుగా ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వారాహి వాహనానికి పూజలు చేయించారు.

    ఆలయ సంప్రదాయం ప్రకారం వేదపండితులు పవన్ కు స్వాగతం పలికారు. ఆయన ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు పవన్ ప్రచార రథం వారాహికి వాహన పూజ నిర్వహించారు. కొండగట్టు ఆంజనేయస్వామి అంటే పవన్ కు ఎంతో భక్తి. పవన్ రాకతో కొండగట్టులో కోలాహలం నెలకొంది. జనసైనికులు, పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో కొండగట్టుకు చేరుకున్నారు. పవన్ కు ఆహ్వానం పలుకుతూ పెద్ద ఎత్తున బ్యానర్లు వెలిశాయి. ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

    కొండగట్టులో జగిత్యాల డీఎస్సీ ఆధర్వంలో 200 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ జనసేన ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. కొడిమ్యాల మండలం నాచుపల్లిలో నేతలతో పవన్ సమావేశం అయ్యారు. నారసింహా క్షేత్రాల సందర్శనలో భాగంగా సాయంత్రం 4 గంటలకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పవన్ పూజలు చేయనున్నారు.

    Trending Stories

    Related Stories