More

    వైఎస్ఆర్‎సీపీకి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

    మంగళగిరి: వైఎస్ఆర్‎సీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇకపై తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసైనికులతో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు నిప్పులు చెరిగారు. వెధవల్లారా, సన్నాసుల్లారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను స్కార్పియో కొన్నా కూడా వాళ్లిచ్చారా, వీళ్లిచ్చారా అని వైఎఆర్సీపీ నేతలు అంటుంటారని… ఒరేయ్ వెధవల్లారా నేనెంత సంపాదిస్తానో మీకు తెలుసారా? అని ప్రశ్నించారు.

    గత 8ఏళ్లలో తాను 6సినిమాలు చేశానని… రూ. 100కోట్ల నుంచి రూ. 120 కోట్ల రూపాయలను సంపాదించానని రూ. 33కోట్లుకుపైగా ట్యాక్స్ కట్టానని పవన్ చెప్పారు. ఇది జీఎస్టీ కాకుండా అని తెలిపారు. తన బిడ్డల పేరిట వేసిన ఫిక్స్ డ్ డిపాజిట్లను బ్రేక్ చేసి పార్టీ ఆఫీస్ పెట్టానన్నారు. 2021-22లో రూ. 5కోట్లు పార్టీ ఫండ్ గా ఇచ్చానని తెలిపారు. హుదూద్ తుపాన్ దగ్గర నుంచి సైనిక్ బోర్డు, పీఎం కేర్ ఫండ్‎తో పాటు రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‎కు దాదాపు రూ. 12కోట్లు ఇచ్చానని చెప్పారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి రూ. 30 లక్షలు ఇచ్చానన్నారు.

    జనసేనకు ఐదు బ్యాంక్ ఖాతాలున్నాయని.. అందులో రూ. 17,58,06,323 కార్పస్ ఫండ్ ఉందని పవన్ చెప్పారు. కేవలం రైతు భరోసా కోసం రూ.3,50,78,226ల ఉందని చెప్పారు. మొన్న తన పుట్టిన రోజు కోసం జనసైనికులు చేయాలనుకున్న కార్యక్రమం కోసం వచ్చిన విరాళాలు రూ. 4,32,19,395లు అని వెల్లడించారు. ఇంకొకసారి ప్యాకేజీ అంటే చెప్పు తీసుకుని కొడతానని వార్నింగ్ ఇచ్చారు.

    Trending Stories

    Related Stories