Telugu States

మెగాస్టార్ ని అయినా కింద కుర్చోపెడతాం అనే ఆలోచనా ధోరణి నాకు నచ్చలేదు: పవన్ కళ్యాణ్

జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించిన కౌలు రైతు భ‌రోసా యాత్ర‌లో భాగంగా కడ‌ప జిల్లాలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సిద్ధవ‌టం మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన ర‌చ్చ‌బండ‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చేతులు కట్టుకుని ఉండాల్సిందే అనే వైసీపీ ధోరణి కరెక్ట్ కాదని అన్నారు. ముఖ్యమంత్రి అయితే నువ్వేమైనా దిగొచ్చావా? మీకేమైనా కొమ్ములున్నాయా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతకాలమని భయడతామని, ఎవరికని భయపడతామని అన్నారు. ఆస్తులు ఉంటే ఉంటాయి, పోతే పోతాయని, కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం చంపుకోలేమన్నారు. ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా చూద్దామనుకున్న వ్యక్తిని చేతులు కట్టుకునేలా చేశారని.. ఇది అహంకార ధోరణి అని అన్నారు. కోట్లాదిమందికి తెలిసిన హీరోని, తన కుటుంబంలోని వ్యక్తితో చేతులెత్తి మొక్కించాడంటే ఈ వ్యక్తిని ఏమనుకోవాలని ప్రశ్నించారు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టలేని, అంత అహంకారం పనికి రాదని.. చిరంజీవి లాంటి వ్యక్తికే అలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కష్టపడి తినడానికి కూడా మీకొచ్చి నమస్కారం పెట్టాలంటే తమ ఆత్మగౌరవం ఒప్పుకోదన్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకోలేకే భీమ్లానాయక్‌ను వదిలేశానని చెప్పుకొచ్చారు. మాకు ఎదురుతిరిగితే మెగాస్టార్‌నైనా కింద కూర్చోబెడతామన్న ఆధిపత్య ధోరణి సరికాదన్నారు. ఇది ఏ ఒక్కరికో సంబంధించిన విషయం కాదని, ఆత్మగౌరవానికి, అస్థిత్వానికి సంబంధించిన విషయమన్నారు.

Related Articles

Back to top button