More

    పఠాన్ మూవీలో 10 కత్తెరలు.. 3 మూవ్మెంట్స్ తొలగింపు..!

    బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్-దీపిక పదుకొణే జంటగా నటించిన చిత్రం ‘పఠాన్’. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న థియేటర్లకు రాబోతోంది. ఈ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ పాట తీవ్ర వివాదాస్పదమైంది. దీపిక కాషాయరంగు స్విమ్ సూట్ ధరించడంతోపాటు అందులోని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ నిరసనలు వెల్లువెత్తాయి. సినిమాను విడుదల కానివ్వబోమంటూ పలువురు నాయకులు హెచ్చరించారు. ఈ సినిమాను చిత్ర బృందం సెన్సార్ బోర్డు ముందు ప్రదర్శించింది. వీక్షించిన బోర్డు ‘పఠాన్’కు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. పలు కట్స్ సూచించింది. ‘బేషరమ్ రంగ్’ పాటలో దీపిక స్విమ్ సూట్‌లో ఉన్న మూడు క్లోజప్ షాట్స్‌తోపాటు కొన్ని డ్యాన్స్ మూమెంట్స్‌ను తొలగించాలని ఆదేశించింది. సినిమాకు మొత్తంగా 10కిపైగా కట్స్ సూచించింది. ఈ సినిమా రన్‌టైమ్ 2.26.16 గంటలు. సినిమా విడుదల సమయానికి మార్పులు చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది.

    సినిమా విడుదలకు ముందు పఠాన్‌ చిత్ర బృందం నుండి ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఒక ట్వీట్‌లో వెల్లడించారు. స్టార్లు సినిమా గురించి పెద్దగా మాట్లాడాలని అనుకోవడం లేదని.. ఎంతో నిశ్శబ్దంగా ఉండాలని అనుకుంటున్నారని తెలిపారు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం వంటి స్టార్స్ ఉన్నా.. పెద్దగా ప్రమోషన్స్ చేయకుండానే.. పాటలు, ట్రైలర్‌ల విడుదలతో సినిమాను మార్కెట్ చేసుకుంటూ ఉన్నారు. ఇటీవలి కాలంలో అజయ్ దేవగన్, టబు నటించిన దృశ్యం 2 తర్వాత ఇలాంటి స్ట్రాటజీనే పఠాన్ చిత్ర యూనిట్ నమ్ముకున్నారు. ఇంటర్వ్యూలలో చేసే వ్యాఖ్యల కారణంగా బాయ్ కాట్ పిలుపులు, ట్రోల్‌స్ కు అవకాశం ఉండడంతో పఠాన్ చిత్ర బృందం కూడా ఇలాగే ముందుకు వెళ్లాలని భావిస్తూ ఉన్నట్లు తరణ్ ఆదర్శ్ చెప్పుకొచ్చారు. పాటలు, ట్రైలర్‌ల ద్వారా కావాల్సిన రెస్పాన్స్ ను సంపాదించవచ్చనే నమ్మకంతో పఠాన్ చిత్ర బృందం ఉంది.

    Trending Stories

    Related Stories