More

    నల్ల బ్యాండ్లతో మైదానంలోకి ఆసీస్ ఆటగాళ్లు.. ఎందుకంటే..?

    ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి మరియా కమిన్స్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌లో ఉన్న పాట్ కమిన్స్ తన తల్లి అనారోగ్యం కారణంగా రెండో టెస్టు ముగిసిన వెంటనే స్వదేశానికి వెళ్లాడు. మూడో టెస్టు నాటికి కమిన్స్ తిరిగి వస్తాడని భావించినప్పటికీ తల్లి ఆరోగ్యం విషమంగా ఉండడంతో అక్కడే ఉండిపోయాడు. ఈరోజు ఉదయం ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

    ఆమె మృతికి సంతాపంగా అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు రెండోరోజు ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండ్లు తగిలించుకుని మైదానంలోకి వచ్చారు. కమిన్స్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ కూడా మరియా మృతికి సంతాపం తెలిపింది. కమిన్స్ తల్లి 2005లో రొమ్ము కేన్సర్ బారినపడ్డారు. ఇటీవలి కాలంలో ఆమె తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. కమిన్స్ స్థానంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

    Trending Stories

    Related Stories