More

    యూపీ ఫతేపూర్‎లో పాస్టర్ పాడు పనులు..!

    పాడు పని చేసి పరారైన పాస్టర్.. ఒక్కసారి ఊడిపడి.. తిరిగి పాత పాపాలు చేయడానికి రెడీ అయ్యాడు. ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ కు చెందిన పాస్టర్ విజయ్ మసీహ్ పేదవారైన హిందువులను నయాన, భయాన తన దారిలోకి తెచ్చుకుని సామూహిక మత మార్పిడిలకు పాల్పడ్డాడు. అనంతరం బలవంతపు మతమార్పిడి వ్యవహారం బయటపడడంతో ఫలాయన మంత్రం పఠించాడు. రెండు నెలలుగా పత్తా లేకుండా పోయిన విజయ్ మసీహ్.. చేసిన తప్పునకు లెంపలేసుకుని, బుద్ధిగా వుండాల్సింది పోయి.. కుక్క తోక వంకర బుద్ధి ప్రదర్శించాడు.

    దైవ చింతన, ధర్మగుణాలతో ఈ నిరుపేదలు ప్రశాంతంగా హిందూ మతంలో మనుగడ సాగిస్తున్నారు. కూటికి పేదలైనా.. ప్రలోభాలకు లొంగకుండా, అన్యమతంపై కన్నెత్తయినా చూడకుండా, హిందూ మతంపై అపార గౌరవంతో ఉంటున్నారు. మంచి, మానవత్వం గాలికొదిలేసిన ఫతేపూర్ పాస్టర్.. ఈ అమాయకులను భయభ్రాంతులకు గురిచేసి, బలవంతపు మతమార్పిడికి పాల్పడుతున్నాడు. నగరంలోని హరిహర్‌ గంజ్ చర్చిలో రహస్యంగా మరో బలవంతపు సామూహిక మత మార్పిడికి పాల్పడడానికి ప్రయత్నించాడు. దీంతో, పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట చేశారు. అమాయక హిందువుల నుంచి నిందితుడు సేకరించిన ఆధార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధార్ కార్డులన్నీ మతం మారిన హిందువులవని పోలీసులు ధృవీకరించారు.

    చర్చిలో బోధకుడిగా బోధనలు చేయాల్సిన పని గాలికొదిలేసి, అమాయక హిందువులను ఈ ఉచ్చులోకి బలవంతంగా లాగి, వారి బ్రెయిన్ వాష్ చేయడం మొదలెట్టాడు. పేద హిందువులకు మతమార్పిడి పాఠాలు చెప్పే బోధకుడిగా మారి నానా హంగామా చేస్తున్నాడు. హిందూ మతంపై విషం కక్కుతూ..అన్యమతాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ…ఈ దిక్కుమాలిన పాఠాలు చెబుతున్నాడు. నిరుపేదలు, నిస్సహాయులను, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారి వివరాలు తెలుసుకుని ఈ రాక్షస క్రీడ సాగిస్తున్నారు. మతమార్పిడి రాకెట్ లో.. ఈ పాస్టరే కాకుండా మరికొందరు వున్నారని తెలిసిందని, నిందితులందరినీ త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

    అమాయక హిందువులను మభ్యపెట్టి, భయపెట్టి, మానసిక ఆవేదన కల్గించి స్వస్థత ముసుగులో అస్వస్థత కల్గించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో, ఫతేపూర్ ECI చర్చి భవనంలో ఈ బలవంతపు మతమార్పిడి ఘటన జరిగింది. విషయం వెలుగులోకి రావడంతో…పాస్టర్ సహా 26 మంది అరెస్టయ్యారు. ఈ కేసులో పది మంది మహిళలతో సహా మొత్తం 55 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నాడు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫతేపూర్ ఇసిఐ చర్చి భవనాన్ని చుట్టుముట్టి, పాస్టర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో పోలీసులు రంగ ప్రవేశం చేసి, చర్యలు చేపట్టారు. విజయ్ కుమార్ శాంసన్, రేష్మా శాంసన్, రత్నా దౌద్, షారోన్, జ్యోతి మోనాలిసా, గీతా మసీహ్ లు ఈ కేసులో నిందితులుగా వున్నారు.

    ఈ కేసులో ప్రమేయం ఉన్న అనేక మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, నాటి ఘటనలో పాస్టర్ విజయ్ మసీహ్‌ తప్పించుకున్నాడు. ఇప్పుడు…తిరిగి బలవంతపు మతమార్పిడి చర్యలకు పాల్పడుతూ..పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.

    Trending Stories

    Related Stories