ప్రేయర్ పేరుతో కర్నూలు పాస్టర్ బాలికలను తీసుకుని వెళ్లి

0
758

కర్నూలు జిల్లాలో పాస్టర్ చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ప్రేయర్ పేరుతో బాలికలను లైంగికంగా వేధించిన ఓ పాస్టర్ బాగోతం బయటకు రావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేయ‌ర్ పేరుతో ఆ చ‌ర్చి పాస్ట‌ర్ మైన‌ర్ బాలిక‌ల‌పై లైంగిక వేదింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

క‌ర్నూలు జిల్లా చాగ‌ల‌మ‌ర్రి మండ‌లంలో పాస్ట‌ర్ ప్ర‌స‌న్న‌కుమార్ చ‌ర్చిని నిర్వ‌హిస్తున్నాడు. తల్లిదండ్రులు ప‌నికి వెళ్లిన త‌రువాత ప్రేయ‌ర్ పేరుతో ఇద్ద‌రు మైన‌ర్ బాలిక‌ల‌ను చ‌ర్చిలోకి తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు పాల్ప‌డ్డాడు. ఈ విష‌యాన్ని బాధిత బాలిక‌లు త‌ల్లిదండ్రుల‌కు చెప్పడంతో పాస్టర్ ప్రేయర్ల పేరుతో ఇంత దారుణాలకు ఒడిగడుతూ ఉన్నాడా అని షాక్ అయ్యారు. తేరుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. అదే స‌మ‌యంలో ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు పాస్ట‌ర్ ప్ర‌సన్న‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అభం శుభం తెలియని బాలికలను చర్చిలోకి తీసుకెళ్లి పాస్టర్ వారిపై లైంగిక వేధింపులకు పాల్పడే వాడని తెలిసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న చాగలమర్రి పోలీసులు పాస్టర్ ప్రసన్న కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన పాస్టర్ ప్రసన్న కుమార్‌ను విచారిస్తున్నామని..అతడిపై పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు పోలీసులు.