బయటకు వస్తున్న పాస్టర్ అంబటి అనిల్ కుమార్ దారుణాలు

0
901

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో గత నాలుగేళ్లలో 17 మంది మహిళలను లైంగికంగా వేధించినందుకు 42 ఏళ్ల పాస్టర్‌పై కేసు నమోదైంది. క్రైస్తవ పాస్టర్ స్త్రీలు, అమ్మాయిలను బలవంతం చేయడం.. వారిని మోసగించడం చేస్తూ వచ్చాడు. ఆ మహిళల్లో ఒకరు చర్చి నుంచి తప్పించుకుని పోలీసు అధికారులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుల్లో ఒకరు ఫిబ్రవరి 3న పాస్టర్‌పై ఫిర్యాదు చేశారు.

కృష్ణా జిల్లా విజయవాడలోని కృష్ణలంకకు చెందిన అంబటి అనిల్ కుమార్ అలియాస్ ప్రేమ దాస్ అనే పాస్టర్ గతంలో రైల్వేలో టీటీఈగా పనిచేస్తున్నట్లు హిందూ పోస్ట్ నివేదించింది. 2017లో ఉద్యోగానికి రాజీనామా చేసి కుటుంబాన్ని వదిలి క్రైస్తవ మిషనరీని స్థాపించేందుకు పాయకరావుపేటలో స్థిరపడ్డాడు. 2015లో అతను “ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్” పేరుతో ఒక ట్రస్ట్‌ను స్థాపించాడు. పాస్టర్ ఎ అనిల్ కుమార్ అయ్యాడు. రెండు అంతస్తుల భవనంలో చర్చిని ఏర్పాటు చేశాడు. అనంతరం క్రైస్తవ మత ప్రసంగం పేరుతో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 17 మంది మహిళలను రప్పించి పాయకరావుపేటలో మకాం ఏర్పాటు చేశాడు.

పాస్టర్ తనను, ఇతర మహిళలను మినిస్ట్రీస్ కు తీసుకువచ్చాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. గత నాలుగేళ్లుగా పాస్టర్ వారిని లైంగికంగా వేధిస్తున్నాడు. అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పాస్టర్ వారిని బెదిరించాడు. మహిళలతో పాటు, ఏడుగురు అబ్బాయిలను బలవంతంగా అక్కడ ఉంచి, బానిసలుగా చేసుకున్నాడు. బాలురను కూడా చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలు పోలీసులకు సమాచారం అందించింది. బాధితురాలి వాంగ్మూలాల ఆధారంగా పాయకరావుపేట పోలీసులు మిగతా మహిళలను విచారించగా, పాస్టర్‌కు భయపడి వారు మాట్లాడలేదు. విచారణలో పాస్టర్ ఎ అనిల్ కుమార్ దేవుడి పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బు సంపాదించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అత్యాచారం-నిందితుడైన పాస్టర్‌కు యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. బాధలు తీరుస్తాను, నిరుద్యోగులకు ఉద్యోగం తెప్పిస్తాను.. రోగాలను ప్రార్థనలతో దూరం చేస్తానని చెబుతూ ఆన్‌లైన్ ప్రార్థనలు నిర్వహించాడు. అతని మాటలను నమ్మి లక్షల రూపాయలు అతడి చేతుల్లోకి పెట్టారు.

source:https://hindupost.in/

నర్సీపట్నం అదనపు ఎస్పీ డి.మణికంఠ మాట్లాడుతూ ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. పాయకరావుపేట పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో పాస్టర్ ఎ అనిల్ కుమార్ కూడా ఒకరని సమాచారం అందింది. పాస్టర్ తన నేరాల్లో భాగస్వామి అయిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన లిల్లీ అలియాస్ రాజేశ్వరితో కలిసి నివసిస్తున్నాడు. రాజేశ్వరి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు ఇప్పుడు మినిస్ట్రీస్ భవనాన్ని సీజ్ చేశారు.