యాదాద్రి లక్ష్మినారసింహుడి సాక్షిగా భక్తులు ఘర్షణకు దిగారు. కొండపైకి వెళ్లేందుకు భక్తులకు దేవస్థానం యాజమాన్యం ఫ్రీ బస్సు సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. అయితే భక్తుల తరలింపునకు అయ్యే ఖర్చు దేవస్థానమే భరిస్తుంది. కొండపైకి వెళ్లేందుకు ఆర్టీసీ మినీ బస్సులను నడుపుతోంది.
ఇలాంటి తరుణంలో బస్సులో రద్దీ ఎక్కువ కావడంతో సీట్ల కోసం భక్తుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో గుట్టపైనే భక్తులు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ ఘర్షణలో మహిళా భక్తులు కింద పడిపోయారు. కేవలం పది నిమిషాల ప్రయాణానికి సీట్ల కోసం కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు యాద్రాద్రి గుట్టపైకి ప్రైవేటు వాహనాలను సైతం అనుమతిస్తున్నారు. అయితే అధిక పార్కింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. తొలుత ఫోర్ విలర్ వాహనానికి గంటకు 500 రూపాయలు ఫిక్స్ చేయగా.. తీవ్ర విమర్శలు రావడంతో గంట నిబంధనను ఆలయ కమిటీ ఎత్తివేసింది.