చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ నుండి ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ విడుదల

0
633
Party Song Of The Year- Boss Party From Megastar Chiranjeevi, Urvashi Rautela, Bobby Kolli, Mythri Movie Makers’ Waltair Veerayya Unveiled
Party Song Of The Year- Boss Party From Megastar Chiranjeevi, Urvashi Rautela, Bobby Kolli, Mythri Movie Makers’ Waltair Veerayya Unveiled

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర)ల క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ 2023లో విడుదలవుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌ లో ఒకటి. ఈ సినిమా విశేషమేమిటంటే, చిరంజీవి మాసియస్ట్ క్యారెక్టర్‌లో అభిమానులు, మాస్ కు పూనకాలు తెప్పించనున్నారు. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానైన దర్శకుడు బాబీ కొల్లి.. మెగాస్టార్ ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌ లో ప్రజంట్ చేస్తున్నారు.
ఈ రోజు విడుదలైన ‘వాల్తేర్ వీరయ్య’ ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ వెండితెరపై సృష్టించబోయే మాస్ ప్రభంజనంకు సాక్ష్యంగా నిలిచింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా వేదికగా వైరల్‌ గా మారింది. టీమ్ ప్రమోట్ చేసిన ప్రకారం.. బాస్ పార్టీ.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ కానుంది.
మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుతూ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటను కంపోజ్ చేసి, ఆయనే రాసి, పాడారు. బాస్ పార్టీ డీఎస్పీ స్టయిల్ లో మాస్ మసాలా నంబర్. నకాష్ అజీజ్, హరిప్రియ డైనమిక్ గా పాడిన ఈ పాటకు దేవిశ్రీ ర్యాప్ డబల్ ఎనర్జీ జోడిస్తుంది. డీఎస్పీ ట్రాక్‌ లైవ్లీ గా ఎంటర్ టైనింగా ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా మెస్మరైజ్ చేస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి తన అద్భుతమైన డాన్సులతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. లుంగీలో చిరంజీవి వింటేజ్ మాస్ అవతార్, మాస్ అప్పీలింగ్ డ్యాన్సులు అవుట్ స్టాండింగా వున్నాయి. ముఖ్యంగా మెగా హుక్ స్టెప్ మార్వలెస్. ఊర్వశి రౌతేలా చిరంజీవి ఎనర్జీని అందుకోవడానికి ప్రయత్నించి విజయం సాధించింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత.
ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా , నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌ గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.
వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు.
సాంకేతిక విభాగం:
కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి)
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
సిఈవో: చెర్రీ
కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల
లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి
పీఆర్వో: వంశీ-శేఖర్
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

five × five =