Telugu States

పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌లను అడ్డుకున్న పోలీసులు

శ్రీ సత్యసాయి జిల్లాలో రైతు సమస్యలపై చలో కలెక్టరేట్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. పుట్టపర్తి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రామగిరిలో మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సునీత పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రైతుల సమస్యలపై కలెక్టరేట్‌కు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఒకే వాహనంలో వెళ్లాలని పోలీసులు సూచించడంతో.. పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చలో కలెక్టరేట్‌పై ముందస్తుగా అప్రమత్తమై చౌదరిని గృహనిర్బంధం చేశారు. రైతాంగం సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని, అన్నదాతల సమస్యలు పరిష్కరించకుండా సీఎం జగన్ జిల్లాకు ఎలా వస్తారని ప్రభాకర్ మండిపడ్డారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. జిల్లా కలెక్టరేట్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఎదురుగా వెళ్లే వాహనాలను సంఘటనా స్థలానికి మళ్లించి కలెక్టరేట్‌కు అన్ని వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Related Articles

Back to top button