తాలిబాన్‌లపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు ఎక్కిన జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీ తల్లిదండ్రులు

0
961

రాయిటర్స్ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీని తాలిబాన్లు దారుణంగా హత్య చేసిన 8 నెలల తర్వాత, అతని కుటుంబ సభ్యులు అతని హంతకులపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ICC)ని తరలించాలని నిర్ణయించుకున్నారు. “మంగళవారం, మార్చి 22, 2022, డానిష్ సిద్ధిఖీ తల్లిదండ్రులు అక్తర్ సిద్ధిఖీ, షాహిదా అక్తర్ అతని హత్యపై దర్యాప్తు చేయడానికి, తాలిబాన్ ఉన్నత స్థాయి కమాండర్లు, నాయకులతో సహా బాధ్యులను బోనులో నిలబెట్టడానికి చట్టపరమైన చర్యను ప్రారంభిస్తారు” అని ఇండియా టుడే జర్నలిస్ట్ గీతా మోహన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

“ఇటువంటి చర్యలు కేవలం ఒక హత్య మాత్రమే కాదు, మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరం. ఇదొక యుద్ధ నేరం” అని వారు తెలిపారు. 70,000 మంది పౌరులు చనిపోవడంలో తాలిబాన్ ప్రమేయం ఉందని సిద్ధిఖీ తల్లిదండ్రులు ఆరోపించారు. సిసిరో ఛాంబర్స్‌కు చెందిన న్యాయవాది అవి సింగ్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో పిటిషనర్ల తరపున వాదించనున్నారు.

తాలిబాన్లు పెట్టిన చిత్రహింసలు:
జూలై 16, 2021న యుద్ధంలో దెబ్బతిన్న దేశమైన ఆఫ్ఘనిస్తాన్‌లో ఒక అసైన్‌మెంట్ లో భాగంగా ఉన్న డానిష్ సిద్ధిఖీ తాలిబాన్‌చే చంపబడ్డాడు. ఆఫ్ఘన్ దళాలు, ఇస్లామిస్టుల మధ్య జరిగిన ఘర్షణలను కవర్ చేయడానికి అతను ఆఫ్ఘన్ జాతీయ దళాలతో కలిసి స్పిన్ బోల్డాక్ ప్రాంతానికి వెళ్లాడు. ఆఫ్ఘన్‌ బలగాలు కస్టమ్స్‌ పోస్ట్‌ వద్దకు చేరుకోగానే తాలిబాన్లు వారిపై దాడి చేశారని పీటీఐ నివేదిక పేర్కొంది. సిద్ధిఖీతో పాటూ మరో ముగ్గురు ఆఫ్ఘన్ సేనలు విడిచిపెట్టాయి. ఆ సమయంలో సిద్దిఖీకి గాయం అవ్వడంతో స్థానిక మసీదుకు వెళ్లి అక్కడ ప్రథమ చికిత్స చేయించుకుంటూ ఉన్నారు. భారతీయ జర్నలిస్ట్ మసీదు లోపల ఆశ్రయం పొందుతున్నాడని తాలిబాన్‌లకు తెలిసింది. మసీదులో సిద్ధిఖీ ఉండటం వల్లనే తాలిబాన్లు దాడి చేశారని స్థానిక విచారణ సూచించింది. “తాలిబాన్లు అతన్ని పట్టుకున్నప్పుడు సిద్ధిఖీ బతికే ఉన్నాడు. తాలిబాన్లు సిద్ధిఖీ గుర్తింపును ధృవీకరించారు. అతనితో ఉన్న వారిని కూడా ఉరితీశారు. కమాండర్, అతని బృందంలోని మిగిలిన వారు అతనిని రక్షించడానికి ప్రయత్నించగా వారు కూడా ప్రాణాలు కోల్పోయారు ”అని వాషింగ్టన్ ఎగ్జామినర్‌లో ఒక నివేదిక తెలిపింది.

అతను భారతీయుడు అనే కారణంగానే అతని శరీరాన్ని ఛిద్రం చేశారని కూడా నివేదించబడింది. తాలిబాన్లు మొదట డానిష్‌ను కాల్చివేసి, ఆపై అతనిపైకి కారు నడిపినట్లు ఆఫ్ఘన్ ఆర్మీ కమాండర్ బిలాల్ అహ్మద్ వెల్లడించారు. తాలిబాన్లు భారతీయులపై తమకున్న ద్వేషాన్ని ఇలా ప్రదర్శించారని కూడా చెబుతున్నారు.