కౌంటింగ్ సెంటర్ నుండి వెళ్ళిపోయిన పాల్వాయి స్రవంతి రెడ్డి

0
882

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలకు సంబంధించి టీఆర్ఎస్- బీజేపీ మధ్య హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీ కాంగ్రెస్ వెనుకబడిపోయింది. దీంతో, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ సెంటర్ నుంచి నిరాశతో నిష్క్రమించారు. ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇది ఒక సాధారణ ఉప ఎన్నిక మాత్రమే అని అన్నారు. ఈ ఎన్నికల ప్రభావం రానున్ను ఎన్నికల పైన ఉండదన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కోసం జరిగిన ఎన్నిక ఇదని అభివర్ణించారు.