మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురు స్రవంతిని మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు. శుక్రవారం చండూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన స్రవంతి, తండ్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిని తలచుకొని కంటతడి పెట్టారు. తన తండ్రి ఆశయాల సాధన కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. సభలో మాట్లాడే సమయంలోనూ స్రవంతి కన్నీటి పర్యంతమయ్యారు. ఈరోజు నాన్నలేని లోటు నాకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న మీరందరూ నా తోబుట్టువులై, నా తండ్రిస్థానం తీసుకుని, నాతోపాటు నడవాలని నా చేతులు చాచి, నా కొంగు చాచి ప్రాదేయపడుతున్నాను.. మీ ఒక్క ఓటు, మీ ఒక్కటే ఒక్క ఓటు ఈసారి ఈ ఎన్నికల్లో నాకే వెయ్యాలని కోరుతున్నా అని అన్నారు పాల్వాయి స్రవంతి రెడ్డి.