More

    రాజీవ్ సాయి సేఫ్

    పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎనిమిదేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు రాజీవ్ సాయి (8) అనే బాలుడిని కిడ్నాప్ చేశారు. రాజీవ్ తండ్రి చెన్నైలో ధాన్యం వ్యాపారం చేస్తున్నారు. దసరా పండుగ కోసం వీరి కుటుంబం చెన్నై నుంచి చిలకలూరిపేటకు వచ్చింది. పట్టణంలోని 13వ వార్డులో ఉన్న దేవాలయంలో రాజీవ్ తల్లిదండ్రులు పూజలు చేస్తున్న సమయంలో బాలుడుని దుండగులు కిడ్నాప్ చేశారు. రాజీవ్ తల్లిందండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలను మొదలుపెట్టారు. అయితే రాజీవ్ సాయి క్షేమంగా దొరకడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కొన్ని గంటల్లో రాజీవ్ సాయి క్షేమంగా బయటపడ్డాడు. నెల్లూరు జిల్లా కావలి వద్ద బాలుడిని దుండగులు కారులో వదిలివెళ్లారు. కావలి వద్ద రాజీవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కావలి నుంచి బాలుడిని చిలకలూరిపేటకు తీసుకువస్తున్నారు. బాలుడి క్షేమ సమాచారం విన్న తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

    Trending Stories

    Related Stories