భారత్‎లో భారీ పేలుళ్లకు ఉగ్రకుట్ర

0
886

భారత దేశంలో రైల్వే ట్రాక్‌లను పేల్చివేసేందుకు పాకిస్థాన్ ఐఎస్‌ఐ కుట్ర పన్నిందని తాజాగా వెల్లడైంది. పంజాబ్ రాష్ట్రంతోపాటు చుట్టుపక్కల ఉన్న రైల్వే ట్రాక్‌లను పేల్చివేసేందుకు పాక్ ఐఎస్ఐ కేంద్ర ఇంటెలిజెన్స్ తాగా హెచ్చరించింది.

సరుకుల రవాణా చేసే రైళ్లను పేల్చివేసేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐతో స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయని భారత నిఘా సంస్థల అధికారులు తాజా బులెటెన్‌లో హెచ్చరించారు. రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి ఐఎస్‌ఐ భారతదేశంలోని తన కార్యకర్తలకు పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తోందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అలర్ట్‌ చేశాయి. భారత్‌లో ఉన్న పాక్‌ స్లీపర్‌ సెల్స్‌కు తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారని ఇంటెలిజెన్స్ వివరించింది.

ఇటీవల దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను హర్యానా పోలీసులు భగ్నం చేశారు. ఓ ఇన్నోవా వాహనంలో పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలను పలు రాష్ట్రాలకు తరలిస్తోన్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి మూడు ఆర్డీఎక్స్ కంటైనర్లు, ఒక తపాకీ, 31 రౌండ్ల లైవ్ క్యాటరిడ్జ్ లతో పాటు లక్ష 30వేల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ నుంచి డ్రోన్ ద్వారా ఈ ఆయుధాలు వచ్చినట్టు నిందితులు విచారణలో చెప్పినట్లు సమాచారం.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

five × 4 =