పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గతకొంత కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. గత నెలలో ఆ దేశ ప్రతిపక్ష పార్టీలు పెట్టిన అవిశ్వాసంలో పదవిని కోల్పోయిన ఇమ్రాన్.. తాజా ప్రభుత్వంపై విరుచుకుపడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.
ప్రస్తుతం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ తనను తాను గాడిదతో పోల్చుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను హసన్ జైదీ అనే వ్యక్తి ట్విటర్ లో పోస్టు చేశాడు. దీంతో నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
ప్రధాని పదవి కోల్పోయిన అనంతరం ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వివిధ దేశాలతో తనకు సత్సవంబంధాలు ఉన్నప్పటికీ పాకిస్థాన్ నా మాతృభూమి అంటూ వివరించారు. బ్రిటన్ లో ఎక్కువకాలం గడిపానని, అక్కడ ఎంతో మంది స్నేహితులు, అభిమానులు నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని అన్నారు. అయినప్పటికీ ఆ దేశాన్ని నేనెప్పుడూ సొంతిల్లు మాదిరిగా పరిగణించలేదని, నేను ఎప్పటికీ పాకిస్థానినే అన్నారు. ఈ క్రమంలో గాడిదకు కేవలం రంగులు వేసినంత మాత్రాన అది చారల గుర్రం కాలేదు.. గాడిద గాడిదే అని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెటిజర్లను తెగ ట్రోల్ చేస్తున్నారు.
ఇందుకు సంబంధించిన క్లిప్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ కామెంట్‌తో ఆడేసుకుంటున్నారు. పాకిస్థాన్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ జునైద్ అక్రమ్ నిర్వహించే పాడ్‌కాస్ట్‌లో భాగంగా ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉండగా.. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంతో ఏప్రిల్ 10వ తేదీన పాక్ ప్రధాని పీఠం నుంచి ఇమ్రాన్ ఖాన్ దిగిపోయాడు. ముందస్తు ఎన్నికలకు కోసం ఖాన్ డిమాండ్ చేస్తున్నప్పటికీ.. మే 2023 కంటే ముందు నిర్వహించడం కష్టమేనని పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ చెప్తోంది.
Without comment. pic.twitter.com/l0Jwpomqvp
— Hasan Zaidi (@hyzaidi) May 6, 2022